ప్రపంచంలో కరోనా వైరస్ చేస్తున్న బీభత్సానికి మనుషులు తిరిగే ప్రదేశాలు అన్నీ మూతపడే పరిస్థితి నెలకొంటుంది.  వారం రోజులు కష్టపడి వీక్ ఎండ్ లో కాస్త సేద తీరాలని చూసేవారికి నిరాశే మిగులుతుంది.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, క్లబ్బులు, థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్ ఫూల్స్ ఒక్కటేమిటి జనసంద్రంగా ఉండే అన్ని ప్రదేశాలను మూసివేస్తున్నారు. స్వయంగా వాటిని క్లోజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలనే ఆదేశిస్తున్నాయి.  దాంతో ఇప్పుడు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారంతా ఇంటికే పరిమితం అవుతున్నారు.  ఇక స్టేడియాలు, మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్సులకు తాళాలు వేసేశారు. దాంతో ఇప్పుడు ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. మరికొంత మంది సెలబ్రెటీలు కరోనా వైరస్ నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అన్న విషయంపై వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

 

ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఎవరికి తోచినది వారు చేస్తున్నారు.  ఇంటివద్ద ఉన్నబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెయింటింగ్ వేశాడు.. కత్రినా గిటార్ వాయిస్తుంది సందడి చేసింది.  తాజాగా టీమిండియా స్పిన్నర్‌‌ యజువేంద్ర చాహల్ మాత్రం భిన్నమైన దారి ఎంచుకున్నాడు.  ఇంట్లో ఒంటరిగా డ్యాన్స్‌ చేయడంతో పాటు తన స్నేహితురాళ్లతో చాహల్‌ సరదాగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు టిక్‌టాక్‌లో హల్ చల్‌ చేస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో చాహల్‌ను ఓ అమ్మాయి ఆటపట్టించి అతని బుగ్గలు గిల్లడం ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో సంగీతం వినిపిస్తుండగా ఓ అమ్మాయితో చాహల్ సరదాగా నడుచుకుంటూ వస్తున్నాడు. అతని వెంట ఓ అమ్మాయి హ్యాపీగా గంతులు వేస్తుంది.. తన షూ లేసులు కట్టుకున్న చాహల్ లేచి ఆ ఆమ్మాయిని కొట్టబోతాడు.. కానీ ఆ అమ్మాయి మనోడి బుగ్గ గిల్లడంతో ఆశ్చర్యంతో చూస్తుండిపోతాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలతో గెత వైరల్ అవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: