క్రికెట్ పుట్టినిల్లు.. ఇంగ్లాండ్ లో మే 28 వరకు ప్రొఫెషనల్ క్రికెట్ వుండదని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ ) వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచ దేశాలు విల విలలాడుతున్న విషయం తెలిసిందే దాంతో ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. మే 28 వరకు ఇంగ్లాండ్ మరియు వేల్స్ లో ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నీల నిర్వహణ ఉండదని ఈసీబీ పేర్కొంది. ఇప్పటికే కరోనా వల్ల శ్రీలంక తో జరుగాల్సిన టెస్టు సిరీస్ ను ఇంగ్లాండ్ రద్దు చేసుకుంది.
 
ఇదిలావుంటే కరోనా ప్రభావం క్రీడా రంగం పై  తీవ్రంగా వుంది. ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా జరుగాల్సిన వివిధ క్రీడా టోర్నీలు రద్దు అయ్యాయి. అంతేకాదు కరోనా వల్ల  కాసుల కురిపించే క్రికెట్ లీగ్ ఐపీఎల్ నిర్వహణ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈనెల 29 నుండి జరుగాల్సిన ఈ లీగ్ ను ఏప్రిల్ 15వరకు వాయిదావేశారు.
 
ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే  వచ్చే నెల 15 తరువాత కూడా  టోర్నీ నిర్వహించేలా కనిపించడం లేదు. అయితే  బీసీసీఐ.. ఈఏడాది ఐపీఎల్ ను జూలై -సెప్టెంబర్ మధ్య లో నిర్వహించేలా సన్నాహాలు చేస్తుంది అలా చేస్తే విదేశీ ఆటగాళ్లు అప్పటివరకు అందుబాటులో వుంటారో లేదో తెలియదు. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: