ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మాయదారి కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది.  ఇప్పటికే అన్ని దేశాల్లో కరోనా వల్ల వాణిజ్య వ్యస్థలు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. కరోనా  కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది.. ముఖ్యంగా విదేశీ విమానాల రాకపోకలపై ఈ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది.. కరోనా వైరస్‌ వల్ల ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌తో పాటు చాలా టోర్నీలు వాయిదా పడ్డాయి.  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) రోజురోజుకు వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఇప్పటికే ఓ ఫుట్‌బాల్‌ చనిపోగా.. ప్రతిష్ఠాత్మక 'లా లిగా' క్లబ్‌కు చెందిన స్పానిష్‌ ఫుట్‌బాల్‌ జట్టు అలవేస్‌లోని 15 మందికి సోకింది. తాజాగా ప్రముఖ క్రికెర్ మజిద్ హక్ కి కరోనా పాజిటీవ్ అని తేలిందట. 

 

2006 నుంచి 2015 వరకు అంతర్జాతీయ క్రికెటర్‌గా కొనసాగిన అతను 54 వన్డేలు, 24 టీ20లు ఆడాడు.  పాకిస్థాన్ దేశస్థుడైన మజిద్‌ హాక్‌.. స్కాట్లాండ్‌ జట్టుకు ఆఫ్‌స్పిన్నర్‌గా సేవలందించాడు‌. ఇటీవల కరోనా వ్యాపించడంతో చికిత్స తీసుకుంటున్నానని  సోషల్ మాద్యమంలో ఓ పోస్ట్ చేశాడు. గ్లాస్గోలోని రాయల్‌ అలెగ్జాండ్రియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకు వస్తా అని మజిద్‌ పోస్ట్ చేశాడు. పెయిస్లీలోని రాయల్‌ అలెగ్జాండ్రియా ఆస్పత్రి సిబ్బంది చాలా బాగా చూసుకున్నారు. ఈ సందర్భంగా నాకు మెసేజెస్‌ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 

 

2015 ప్రపంచకప్‌లో చివరిసారి ఆడిన అతను గతేడాది వరకు స్కాట్లాండ్‌ తరఫున అత్యధిక వన్డే వికెట్లు(60) తీసిన బౌలర్‌గా కొనసాగాడు. 2019లో ఫాస్ట్‌బౌలర్‌ సయాన్‌ షరిఫ్‌ అతడిని అధిగమించాడు. ప్రస్తుతం మజిద్‌ దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం మన దేశం లో కరోనా బాధితుల సంఖ్య 296 గా ఉంది. అలాగే మన తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 20కి చేరుకున్నాయి. అయితే ఈ వైరస్ ప్రభావం క్రీడారంగం పైన ఘోరంగా పడిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: