కరోనా ఈ పేరు వింటేనే మానవుని వెన్నులో దడ పుట్టుకొస్తుంది. ఈ మహమ్మారి మానవులను ఎంతగా భయాందోళనకు గురి చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. రోజు రోజుకు ఈ వ్యాధి ఎక్కవ అవుతుందే కానీ తగ్గడం లేదు. కరోనా వైరస్ ను తగ్గించాలనుకున్న దీని నివారణకు ఇంత వరకు మందు కనిపెట్టలేదు. మన దేశ ప్రభుత్వం ఎంతగ్గా అప్రమతమై ఎన్ని చర్యలు తీసుకున్న రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

 

కరోనా వైర‌స్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్నిముచ్చెమటలు పట్టేలా వణికిస్తుంది. ఇలాంటి సమయంలో టెన్నిస్ గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌ని భార‌త అగ్ర‌శ్రేణి ప్లేయ‌ర్ సానియా మీర్జా అభిప్రాయ‌పడ్డారు. ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్ గురించి ఆలోచిస్తున్న‌ సమయంలో ఆట‌ను కాసేపు ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని సానియా వ్యాఖ్యానించారు. 

 

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని పరిస్థితులను బట్టి తాజాగా వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీని వ‌చ్చే సెప్టెంబ‌ర్‌ వరకు వాయిదా వేసిన‌ట్లు సోషల్ మీడియాలో నిర్వ‌హాకులు ప్ర‌క‌టించారు. ఈ [ప్రకటన పై తాజాగా సానియా పైవిధంగా స్పందించింది. వైర‌స్‌ పై వేచి చూసే ధోర‌ణి అవ‌లంబించాల‌న్నారు. దీనిపై అతిగా స్పందించడం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు.

 

ఒక్కవైపు కరోనా భయపెట్టిస్తుంటే మ‌రోవైపు ఇటీవ‌లే ఫెడ్ క‌ప్‌ లో భాగంగా దుబాయ్‌ లో టెన్నిస్ మ్యాచ్‌ల‌ను సానియా ఆడింది. ఆ మ్యాచ్‌ ల‌కు జ‌నం అంత‌గా హాజ‌రుకాలేద‌ని గుర్తుచేశారు. ఈ మ్యాచ్ చాలా త‌క్కువ సంఖ్య‌లో వీక్ష‌కుల మ‌ధ్య‌లో ఆడామ‌ని తెలిపారు.

 

ప్ర‌స్తుత ప్రపంచం ఉన్న ప‌రిస్థితుల్లో టెన్నిస్ మ్యాచ్‌లు ఆడ‌టం లేదా టోర్నీలు గెలుపొంద‌డంపై ఎవ‌రికీ ఆస‌క్తి లేద‌ని సానియా తెలిపారు. ఇక క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై పడే అవకాశంఉందన్నారు. ఈ వైర‌స్ కార‌ణంగా ఐపీఎల్‌, యూరోక‌ప్‌, ఎన్‌బీఏ, షూటింగ్ ప్ర‌పంచ‌క‌ప్ త‌దిత‌ర ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలు వాయిదా ప‌డ్డాయన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: