ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో ముగిసిన మహిళల టీ - 20 ప్రపంచకప్‌ లో సెమీఫైనల్‌ మ్యాచ్‌ లకు రిజర్వ్‌ డే లేకపోవడంతో, దాని ఫలితంగా భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన తొలి సెమీస్‌ మ్యాచ్ రద్దు అవ్వగా, అలాగే మరో మ్యాచ్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో సెమీస్‌ లోనూ DRS పద్ధతి ద్వారా ఫలితం వచ్చింది. ఈ సందర్భంలో లీగ్‌ దశలో ఎక్కువ విజయాలు నమోదు  చేయడంతో ఇంగ్లండ్‌ ను వెనక్కి నెట్టి భారత్‌ జట్టు ఫైనల్‌ లో మ్యాచ్ ఆడకుండానే స్థానం సాధించింది. 

 

 


దింతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనికి కారణం కీలకమైన సెమీస్‌ కు కనీసం రిజర్వ్‌ డే పెట్టకపోవడం. ఇక పోతే ప్రతిష్టాత్మక పురుషుల టీ - 20 ప్రపంచకప్‌ లో అలాంటి పరిస్థితి మరోసారి ఎదురు కాకూడదని ఆతిథ్య బోర్డు క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) ఐసీసీ ని కోరింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం... ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌ కు మాత్రమే రిజర్వ్‌ డే ఉంది, కాకపోతే  ఇప్పుడు సెమీఫైనల్స్‌ కు కూడా రిజర్వ్‌ డే  ఉంచాలని ఐసీసీకి క్రికెట్‌ ఆస్ట్రేలియా విజ్ఞప్తి చేయాలనీ నిర్ణయించింది. ఈ విషయంలో త్వరలో జరగబోతున్న ఐసీసీ క్రికెట్‌ కమిటీ సమావేశంలో సీఏ ఈ ప్రతిపాదన పెట్టనున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: