క్రికెట్ ప్రేక్షకులందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఐపీఎల్ టోర్నీ ఇంకొన్ని రోజుల్లో జరగబోతుంది అనుకుంటున్న తరుణంలో కరోనా  వైరస్ ప్రభావంతో ఐపీఎల్ కాస్త వాయిదా పడి అభిమానులందరికీ నిరాశే ఎదురైనా విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండటం... ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు కూడా నిర్బంధంలోకి వెళ్ళి పోతూ ఉండటం.. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గకపోవడంతో ఐపీఎల్ ఈ ఏడాది జరుగుతుందా లేదా అనే సందేహాలు కూడా ఎక్కువవుతున్నాయి. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మాత్రం మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా  వైరస్ విజృంభణ దృశ్య... బిసిసిఐ కీలక సమావేశం ఏర్పాటు చేసి ఐపీఎల్ ను  ఏప్రిల్ 15 తర్వాత నిర్వహించాలని వాయిదా వేశారు. 

 

 

 అయితే ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడినప్పటికీ... కరోనా  వైరస్ ప్రభావం మాత్రం తగ్గేటట్లుగా  కనిపించకపోవడంతో... ఇక ఈ ఏడాది ఐపీఎల్ జరగడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న అన్నది ప్రస్తుతం కీలకంగా మారిపోయింది. ఈసారి ఐపీఎల్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న అభిమానులందరికీ నిరాశ తప్పేలాలేదు. ఒకవేళ విదేశాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గినప్పటికీ భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇదంతా కుదిరితేనే  ఐపీఎల్ నిర్వహించడం సాధ్యపడుతుంది. ఒకవేళ బీసీసీఐ  ఐపీఎల్ నిర్వహణ విషయంలో ప్లాన్ అమలు చేయాలన్న కరోనా వైరస్ కంట్రోల్ కావాల్సిందే. 

 

 

 ఈ క్రమంలోనే బిసిసిఐ సహా  ఐపీఎల్ ఫ్రాంఛైజీల అందరూ కీలక సమావేశం ఏర్పాటు చేసి... ఈ సమావేశంలో ఐపీఎల్ వాయిదా వెయ్యాలా  లేదా పూర్తిగా రద్దు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య బిసిసిఐ కార్యాలయం తాత్కాలికంగా మూసివేశారు... కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున  అటు హోటళ్లు కూడా అందుబాటులో ఉండటంలేదు... దీంతో ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఐపీఎల్ జరగాలంటే ఐసీసీ షెడ్యూల్ ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక అక్టోబర్లో టి20 వరల్డ్ కప్ జరగబోతున్న విషయం తెలిసిందే. పరిస్థితులు అనుకూలించక పోతే మాత్రం ఐపీఎల్ పూర్తిగా రద్దు అవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఐపీఎల్ రద్దు అయితే బిసిసిఐకి 3500 కోట్లు నష్టం వాటిల్లుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: