ప్రపంచంలో కరోనా వైరస్ దెబ్బకి అన్ని క్రికెట్ టోర్నీలు రద్దు చేయగా ఆటగాళ్లు అందరూ వారివారి ఫ్యామిలీతో సరదాగా సమయం గడుపుతున్నారు. మనదేశంలో IPL ని ఒక పండుగగా జరుపుకుంవారు లేక పోలేదు. కాకపోతే మార్చి 29 నుంచి మొదలు అవ్వాలిసిన ఐపీఎల్ - 2020 సీజన్ ఏప్రిల్ 15 కి వాయిదా పడింది. దీనితో ఇటీవల నిరాశ వ్యక్తం చేసిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పుడు తన ఇంట్లో తన కూతురు సమైరాతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతున్నాడు. తన కూతురు సమైరా కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన బ్యాట్‌‌ తో ఆమెకి రోహిత్ శర్మ బ్యాటింగ్ పాఠాలు నేర్పిస్తున్నాడు. కాకపోతే క్రికెట్ బాల్ స్థానంలో ఫుట్‌బాల్‌‌‌ని రోహిత్ శర్మ ఉంచి నేర్పిస్తున్నాడు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

😍🙌

A post shared by rohit Sharma (@rohitsharma45) on

 


న్యూజిలాండ్ పర్యటన నుంచి తొడ కండరాల దెబ్బతో అర్ధాంతరంగా సిరీస్ నుంచి బయటికి వచ్చిన రోహిత్ శర్మ ఇటీవలె తాను ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీనితో IPL లో ఆడటం ద్వారా మళ్లీ ఫామ్ అందుకోవాలని అనుకున్న మన ఓపెనర్‌ కి కరోనా వైరస్ రూపంలో కాస్త పెద్ద దెబ్బె ఎదురైంది. 2008 సంవత్సరం నుంచి జరుగుతున్న ఐపీఎల్‌ లో ముంబయి ఇండియన్స్‌ టీంకి కెప్టెన్‌ గా రోహిత్ శర్మ ఏకంగా ఏ టీం గెలవనంతగా నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఇందులో కూడా రోహిత్ కీలక పాత్రా పోషించాడని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఐపీల్ వాయిదా పడడంతో  టీమిండియా సభ్యులు వారి వారి ఇంటి సభ్యులతో మనస్పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: