ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఐపీఎల్ పై  కూడా పడిన విషయం తెలిసిందే. ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది మరోసారి క్రికెట్  సందడి మొదలు కాబోతుంది అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులందరికీ నిరాశ ఎదురైంది. ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ మొదలవుతుంది అనుకున్న సమయంలో కరోనా  వైరస్ ప్రభావం ఐపీఎల్ ను కదిలించింది. దీంతో ఐపీఎల్ ని ఏకంగా ఏప్రిల్ 15 తర్వాత నిర్వహించాలని బిసిసిఐ కీలక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించింది. అయితే ప్రస్తుతం రోజురోజుకు ఎక్కడ కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడా మాత్రం తగ్గకపోవడంతో... ఐపీఎల్ నిర్వహించాలా వద్దా అనే దానిపై బిసిసిఐ సహ ప్రాంఛైజీలు  అయోమయంలో  పడిపోయాయి. 

 

 

 ఒకవేళ ఐపీఎల్ ను  రద్దు చేస్తే మాత్రం భారీగా నష్టాలు  వస్తాయి. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ అనేది ప్రధానమైన అంశం కాదు అంటూ.. ఓ ఫ్రాంచైజీ అధికారి వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కరోనా  వైరస్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు నగరాలని లాక్ డౌన్ లో కి వెళ్ళిపోయాయి... రాష్ట్ర సరిహద్దులను మూతపడ్డాయి... అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్ని రద్దయ్యాయి.. ఇక దేశీయ సర్వీసులు కూడా బంద్ కానున్నాయి... ఇక రవాణా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ  ఆగిపోయింది.. రైళ్లు  కూడా ఆగి పోయాయి... ఇదంతా చూస్తుంటే ఐపీఎల్ సీజన్ 2020 వాయిదా పడడం ఖాయం అనిపిస్తుంది. 

 

 

 ఎన్ని ప్లాన్ లు  అమలు చేసిన ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం  నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించడం మాత్రం చాలా కష్టమైన పని అని అర్థమవుతుంది. దీంతో క్రికెట్ అభిమానులు కూడా ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది అంటున్నారు విశ్లేషకులు. ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ.. ఐపీఎల్ లీగ్  పై చర్చించడానికి ఇక  ఏ సమావేశం లేదు అంటూ స్పష్టం చేశారు. అయితే పరిస్థితి బాగా ఉంటే ఐపీఎల్ ను  నిర్వహించాలని భావించి  ఏప్రిల్ 15 తర్వాత నిర్వహించేందుకు ఐపీఎల్ లీగ్ ను వాయిదా వేశారు. కానీ ఇప్పుడు రోజురోజుకూ పరిస్థితి దిగజారి పోతున్న దృశ్య.. ఐపీఎల్ నిర్వహించడం కష్టమే. పక్క రాష్ట్రాల వ్యక్తులనే తమ రాష్ట్రాల్లోకి రానివ్వడం లేదు ఇక విదేశీ ఆటగాళ్లు రాణిస్తారా..? అసలే కుదరదు. అసలు రోడ్డుపైన తిరిగే పరిస్థితి లేదు ఒకవేళ ఐపీఎల్ నిర్వహించిన ఒక్క ప్రేక్షకుడు కూడా స్టేడియానికి వచ్చే అవకాశమూ లేదు. కాబట్టి ఐపీఎల్ వాయిదా కాదు రద్దు ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇండైరెక్టుగా కొంతమంది బిసిసిఐ అధికారులు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నప్పటికీ... అధికారికంగా మాత్రం వెల్లడించేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: