బాహుబలి తో  దేశ వ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకొని సౌత్ తోపాటు నార్త్ లోకూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తరువాత బాహుబలి 2 ఆ తరువాత సాహో తో ప్రభాస్ నార్త్ వారికి మరింత చేరువయ్యాడు. బాలీవుడ్ లో ప్రభాస్ ఎంతో మంది సెలబ్రెటీలకు ఫేవరేట్ యాక్టర్ కాగా  టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కూడా ప్రభాసే నా ఫేవరేట్  సౌత్ ఇండియా యాక్టర్ అని అంటున్నాడు. ఈరోజు ట్విట్టర్  ద్వారా అభిమానులతో ముచ్చటించిన శ్రేయస్ కు ఓ అభిమాని సౌత్ లో మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే భారత మహిళ జట్టులో లో రోడ్రిగోస్ తన అభిమాన క్రికెటర్ అని శ్రేయస్ పేర్కొన్నాడు. 
 
 
 
ఇదిలావుంటే ఇటీవల జాతీయ జట్టులో చోటు సంపాదించుకుని పరిమిత ఓవర్ల క్రికెట్ లో  అద్భుతంగా రాణిస్తూ రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు శ్రేయస్ అయ్యర్. అంతేకాదు ప్రస్తుతం ఐపీఎల్ లో  ఢిల్లీ క్యాపిటల్స్ కు శ్రేయస్  కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: