ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భరత్ లో వేగంగా విజృంభిస్తుంది. భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య బుధవారం ఉదయానికి 569 కి చేరుకున్నారు. ఇంకా రాబోవు రెండు వారాల్లో ఈ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించగా దేశం మొత్తం మోడీ తాజాగా ప్రకటించారు.


దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడానికి కారణాల్ని మోడీ ప్రజలకి వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షకి చేరుకోవడానికి తొలుత 67 రోజుల సమయం పట్టగా.. ఆ తర్వాత రెండో లక్ష‌ని 11 రోజుల్లో, మూడో లక్షని చేరుకోవడానికి కేవలం నాలుగు రోజులే పట్టిందని వెల్లడించారు. దీంతో సామాజిక దూరమే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఏకైక పరిష్కారమని చెప్పుకొచ్చారు.

 

భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో విధించిన లాక్‌డౌన్‌కి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపూర్ణ మద్దతు తెలిపాడు. ఈ సందర్బంగా విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కరోనాపై సోషల్ మీడియాలో సందేశం అందించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సామాజిక దూరం ఒక్కటే మార్గమని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు.

 

ప్రధాని చెప్పినట్లు ప్రతి ఒక్కరం లాక్‌ డౌన్ పాటిద్దామన్నారు. గుంపులుగా ఉండకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. ఇంకా 21 రోజులు కూడా ఇంట్లోనే గడుపుదామని వారు తెలిపారు. కరోనాపై అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తూ ముందుకు వెళ్తామని ఆయన కోరారు.

 

ప్రస్తుతం కరోనా వ్యాప్తిపై సీరియస్‌ గా ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పినట్లు నడచుకోవడం అందరికీ అవసరం అని అది మన బాధ్యత అని వారు సూచించారు. ఇది మనకు పరీక్షా కాలం అన్న అనుష్క శర్మ అందరం కలిసి ఆదేశాలు పాటిద్దామని వేడుకుంటున్నట్లు తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: