కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచంలోని దాదాపు అన్ని అంతర్జాతీయ క్రీడా పోటీలు రద్దు అయినా సంగతి తెలిసిందే. ఇక మన క్రీడా పండుగగా చెప్పుకొనే ఐపీల్ సీజన్ కూడా ఏప్రిల్ 14 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆటగాలందరు వారి కుటుంబాలతో కలిసి సమయాన్ని హాయిగా గడుపుతున్నారు. ఇదంతా బాగేనే ఉన్న కొంతమంది వారి తీరిక సమయంలో ఆన్లైన్ లోకి వచ్చి వారి అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ వారిని ఆనంద పరుస్తున్నారు.  

 

ఇదే కోవలోకి రోహిత్ శర్మ కూడా ఇప్పుడు చేరాడు. ఆయన ఆన్లైన్ లోకి వచ్చిన కొద్దీ సేపటికి ఇంగ్లాండ్ మాజీ దిగజ్జ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా తోడయ్యాడు. వీళ్ల సంభాషణ జరుగుతూ  ఉండగా మధ్యలో AB డివిలియర్స్ కూడా చేరాడు. ABD తన కామెంట్స్ తో కడుబుబ్బా నవ్వించాడు క్రికెట్ అభిమానులని. మొదటగా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లంటూ కామెంట్ చేసాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ ఫేవరెట్ క్రికెటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో ABD తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నట్టు ఒక స్మైలీ బొమ్మని అటాచ్ చేసాడు. అలాగే ‘‘రోహిత్ నేను నీ ఫేవరెట్ క్రికెటర్ కాదా..?" అని కామెంట్ చేసాడు. 

 

 


ఆ వెనువెంటనే రోహిత్ శర్మ నన్ను ఎప్పుడూ స్లెడ్జింగ్ చేస్తుంటాడు అని సరదాగా అభిమానులకి ఫిర్యాదు చేశాడు ABD. ఇక చివరిగా కామెంట్ మాత్రం నవ్వు రక తప్పదు. ఇంతకీ అక్కడ ఏమని పెట్టండంటే ‘‘ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు.. చాహల్‌ కూడా ఇక్కడ ఉన్నాడు.. మిస్ యూ చాహల్’’ అని చాహల్ ఫై ఫన్నీ కామెంట్ చేసాడు. ఏది ఏమైనా వీరి సంభాషణలతో కొద్దీ సేపు అభిమానులంతా తెగ ఆనందపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: