ప్రపంచం అంతా కరోనా వైరస్ తో వణికి పోతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.  నాలుగు లక్షలకు పైగా ఈ కరోనా భారిన పడ్డారు.  ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 21,295కి చేరింది. కరోనా పాజిటివ్ కేసులు 4,17,417 నమోదు అయ్యాయి. ఇటలీలో అత్యధికంగా 74,386 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,503 కరోనా మరణాలు సంభవించాయి.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత మంది ప్రజలు పోలీసులపై దాడి చేస్తున్నారు.

 

తాము ఏదో గొప్ప పని చేస్తున్నట్లు టీక్ టాక్ చేస్తూ సోసల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.   అయితే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా భారత ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెలిసందే. అత్యవసర సమయాల్లో మినహాయించి ప్రజలు బయటికి రాకూడదని చెప్పారు.  కొంత మంది ప్రజలు బయటికి వస్తున్నారు. అయితే అంతే కాకుండా మరి కొందరు ఏకంగా పోలీసుల పైనే దాడికి పాల్పడుతున్నారు.  ఏపిలో కొంతమంది పోలీసులపై రాళ్ల దాడి చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.  తాజాగా  హర్భజన్  తన ట్విట్టర్ లో కొంతమంది పోలీస్ పైన దాడి చేస్తున్న వీడియోను పోస్ట్ చేసాడు.

 

ఇంకా ఆ పోస్ట్ లో... ' పోలీసుల పట్ల మన వైఖరిని మనం మార్చుకోవాలి. మనల్ని కాపాడటానికి వారు తమ ప్రాణాలను పెడుతున్నారని మర్చిపోకండి. వారికి కుటుంబాలు కూడా ఉన్నాయి, కాని వారు దేశం కోసం తమ కర్తవ్యాన్ని చేస్తున్నారు.. మనందరం ఇంట్లోనే ఎందుకు ఉండలేము’అంటూ ప్రశ్నించాడు.  ప్రతిపౌరుడు ఇది సామాజిక బాధ్యతగా తీసుకోవాలి.. ప్రతి ఒక్కరూ ఇంటిపట్టున ఉండాలని ఆయన కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: