ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే దాంతో నేషనల్ వైడ్ గా లాక్ డౌన్ అమలువుతుంది.. మరో రెండు వారాలు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. మరోవైపు కరోనాను అరికట్టడానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు భారీ మొత్తం లో విరాళాలను ప్రకటిస్తున్నారు.
 
తాజాగా ఈజాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా చేరాడు. ఈరోజు,రోహిత్ 80లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఇందులో పీఎం కేర్స్ ఫండ్ కు 45లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 25లక్షలు, జొమాటో ఫీడింగ్ ఇండియా కు 5లక్షలు అలాగే  వీధి కుక్కల సంరక్షణా కేంద్రానికి మరో 5లక్షలు విరాళం గా ఇచ్చినట్లు రోహిత్ తన ట్విట్టర్ ఖాతా  ద్వారా ప్రకటించాడు. 
 
ఇక కరోనా పై పోరుకు టీమిండియా నుండి ఇప్పటివరకు రోహిత్ ,శిఖర్ ధావన్ , సురేష్ రైనా,కోహ్లీ లతోపాటు మాజీ క్రికెటర్లు గంగూలీ, సచిన్, గంభీర్ లు కూడా విరాళాలను ప్రకటించారు. ఇదిలావుంటే భారత మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్10లక్షలు, పూనమ్ యాదవ్ 2లక్షలు అలాగే దీప్తి శర్మ 1.5 లక్షల విరాళాలను ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: