ప్రస్తుతం ప్రపంచాలను ఏదైనా వణికిస్తోంది అంటే కరోనా వైరస్ అని చెప్పాలి. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం స్పెయిన్, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన 7 లక్షల మంది పడ్డారు. 38 వేలమంది కరోనా వైరస్ కారణంగా మృతిచెందారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ తో పోరాడుతున్న వారికి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ వినూత్నంగా మద్దతు ఇచ్చాడు. ఈ కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వారందరికి మద్దతు ఇస్తూ వార్నర్ తన తలను ట్రిమ్మర్‌తో షేవ్ చేసుకొని.. ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. 

 

అయితే వార్నర్ అంతటితో ఆగలేదు.. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈ ఛాలెంజ్ విసిరాడు వార్నర్. అయితే ఈ ఛాలెంజ్ ను విరాట్ కోహ్లీ స్వీకరిస్తాడా? ఎప్పుడు స్టైల్ స్టైల్ హెయిర్ స్టైల్స్ తో అలరించే విరాట్ కోహ్లీ ఈ ఛాలెంజ్ ని స్వీకరించినా? కాగా ఈ కరోనా వైరస్ ఆస్ట్రేలియాలో నాలుగు వేలమందికిపైగా సోకింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: