సచిన్ రమేష్ టెండూల్కర్... నిజానికి ఈ పేరు చెప్పడానికి భారతీయులు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. భారత్లో జాతీయ క్రీడా కబడ్డీ అయినప్పటికీ చాలా మంది క్రికెట్ నే ఎక్కువగా ఆస్వాదిస్తారు. దీనికి ఒకరకంగా మూలా కారణం మన క్రికెట్ ఆరాధ్య దేవుడైన సచిన్ అని అతిశయోక్తి లేకుండా చెప్పుకోవచ్చు. దీనికి కారణం తన 16 సంవత్సరాల లేత వయస్సులో తన ఆటతీరుని ప్రపంచానికి తెలిపాడు కాబట్టి. 

 

 


ఆ తర్వాత ఆయన ఎన్నో రికార్డుల‌ను త‌న పేరిట అలవోకగా లిఖించుకున్నాడు. ప్రస్తుతానికి సచిన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ ప్రకటించి ఇప్ప‌టికి 7 సంవత్సరాలు అయినా.. త‌న పేరుతో ఉన్న కొన్ని రికార్డులు మాత్రం ఇప్పటికి చెక్కు చెద‌ర‌లేదు. ఇవి ఇలా ఉంటే మాత్రం వ‌న్డేల‌కు సంబంధించి ప‌దివేల ప‌రుగుల క్ల‌బ్‌ ను  మార్చి 31, 2001న మొదలు పెట్టింది  స‌చినే కావ‌డం విశేషం. 

 

 

2001 సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టుపై స‌చిన్ ఈ అరుదైన ఖ్యాతిని అప్పట్లోనే సాధించాడు. ఇండోర్‌ స్టేడియంలో జ‌రిగిన ఈ వ‌న్డేలో స‌చిన్ సెంచ‌రీ (139)తో చెల‌రేగ‌డం విశేషం. ఇకపోతే ఇప్పటికీ వన్డేల్లో కూడా అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డు సచిన్ పేరు మీదే ఇంకా అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఆ రోజు మ్యాచ్ లో సచిన్ అజేయంగా 139 పరుగులు చేయగా టీమిండియా ఆసిస్ పై ఏకంగా 118 పరుగులతో విజయం సాధించింది. దీనితో ఆ మ్యాచ్ విజయాన్ని స‌చిన్‌ ను కానుక‌గా భార‌త జ‌ట్టు స‌భ్యులు అందించారు. ఇంకా చెప్పాలంటే వ‌న్డేలు, టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు, అత్య‌ధిక సెంచ‌రీలు, అత్య‌ధిక మ్యాచ్‌ లు లాంటి కొన్ని రికార్డులు ఇంకా లిటిల్ మాస్టర్ పేరు మీదే కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: