స్పెయిన్, ఇటలీ ప్రస్తుతం ఈ రెండు దేశాల పరిస్థితి ఎలా వుందో ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ రెండు దేశాలలో  కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ వెళ్తున్నాయి. నిజానికి స్పెయిన్ ఈ సితిలో ఉండడానికి ముఖ్య కారణం ఇటలీలో జరిగిన ఒక ఫుట్ బాల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  ఫిబ్రవరి 19న ఇటలీలోని మిలన్‌ నగరంలో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఇందుకు కారణం. ఈ మ్యాచ్ కు కానీ వీక్షించేందుకు  సుమారు 50 వేల మంది హాజరు అయ్యారు.

 

 


ఇందులో స్పెయిన్ నుంచి ఈ మ్యాచ్ ను చూడడానికి మూడు వేల మంది స్పెయిన్ అభిమానులు హాజరు అయ్యారు. మిగిలిన వారు అంత ఇటలీ దేశానికీ సంభందించిన వారే. నిజానికి ఆ సమయంలో కరోనా కారణంగా ఇటలీలో  అనేక కేసులు నమోదు అయ్యాయి. దీనితో సుమారు 35 వేలకు పైగా ఇటలీ దేశస్థులు ఆ మ్యాచ్ ను చూడడానికి రావడంతో అందులో  కరోనా సోకిన వ్యక్తులు ఉండడంతో ఆ వ్యాధి స్పెయిన్ నుంచి వచ్చిన అనేక మందికి ఈ వ్యాధి సోకింది అని ఆ దేశ పత్రికలు తెలపడం జరిగింది. ఆ స్టేడియంతో పాటు అక్కడి  బార్లు, బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వేలాదిమంది ఈ మ్యాచ్‌ ను వీక్షించారు.  

 

 

ఆ తర్వాత రెండు రోజులకే లొంబర్డీ ప్రాంతంలోని ఒక ఇటలీ దేశస్థుడికి కరోనా వైరస్‌ లక్షణాలు బయట పడ్డాయి. అప్పటికే జరగలిసిన నష్టం జరిగిపోయింది. సదరు వ్యక్తి  వందల మందితో సన్నిహితంగా కలిసి మెలిసి తిరిగాడు. దీనితో ఆ వందల మంది వేలమందికి వైరస్‌ సోకడానికి కారణం అయ్యారు. ఇక స్పెయిన్‌ లో కూడా  మ్యాచ్‌కు వెళ్లివచ్చినవారిలో దగ్గు, జ్వరం లక్షణాలు ఎక్కువ మందికి కనిపించాయి. స్పెయిన్‌ దేశంలోని వెలన్షియాలో అనేక మంది అదే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. అందులో చాలా  వరుకు ఆ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు హాజరు అయినవారే. ఏది ఏమైనా కరోనా వైరస్ ఎప్పటికి అంతం అవుతుందో వేచి చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: