టీం ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నాడా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రోహిత్ శర్మ గాయం కారణంగా న్యూజిలాండ్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్నా సరే సౌత్ ఆఫ్రికా సీరీస్ కి ఎంపిక చెయ్యాలని చూసినా సరే అతను మాత్రం వద్దనే సమాధానం చెప్పినట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. 

 

అతను కారణం ఏంటో తెలియదు గాని క్రికెట్ మీద ఆసక్తి చూపించడం లేదని దానికి టీం సభ్యులతో ఉన్న విభేదాలే కారణమని అంటున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తో అతనికి విభేదాలు ఉన్నాయని, అలాగే కీలక ఆటగాళ్ళు తనకు విలువ ఇవ్వడం లేదు అనే భావనలో రోహిత్ శర్మ ఉన్నాడని కొందరు అంటున్నారు. అందరూ కోహ్లీ మాట వింటున్నారని తనను కనీసం పట్టించుకోవడం లేదు అనే భావనలో అతను ఉన్నాడు. 

 

దీనితోనే ఇప్పుడు క్రికెట్ నుంచి తప్పుకోవడం ఖాయమని ఐపిఎల్ సహా దేశవాళీ క్రికెట్ మాత్రమే ఆడే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే బోర్డ్ సభ్యులకు కూడా ఇదే విషయం అతను చెప్పాడని అంటున్నారు. గంగూలీ కి సమాచారం ఇవ్వగా ఆయన రోహిత్ తో మాట్లాడారని కాని రోహిత్ మాత్రం జట్టులో ఉండటానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. కరోనా హడావుడి తగ్గాక తప్పుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: