కరోనా వల్ల వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ .. ఐపీఎల్ ఈఏడాది జరగడం పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 29 నుండి జరుగాల్సిన 13వ సీజన్ ఏప్రిల్ 15కు వాయిదాపడింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఆ తరువాత కూడా  ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. అయితే ఆసియా కప్ లాంటి మెగా టోర్నీ ని రద్దు చేసి ఆగస్టు -సెప్టెంబర్ మధ్య లో ఐపీఎల్ ను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందని సమాచారం. ఇది కూడా సాధ్యం అయ్యే ఆవకాశాలు తక్కువే ఎందుకంటే అలా చేస్తే ఆ  సమయంలో జరుగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ ల షెడ్యూల్ ను మార్చాలి. దానికి తోడు వర్షాలు అలాగే అప్పటికి విదేశీ ఆటగాళ్లు ఎంత మంది అందుబాటులో వుంటారో తెలియదు. ఇక బీసీసీఐ ముందు మరో ప్రతిపాదన కూడా వుందట..  అదేంటంటే మొత్తానికే ఈసీజన్ ను వాయిదా వేసి వచ్చే ఏడాది నిర్వహించాలని చూస్తుందని వార్తలు వస్తున్నాయి. 
 
ఒకవేళ అదే జరిగితే ఆటగాళ్లకు భారీ నష్టం రానుంది. ఈ సీజన్ కోసం ఇప్పటివరకు ఆటగాళ్లకు ఐపీఎల్  ప్రాంఛైజీలు చెల్లింపులు చేయలేదు. మాములుగా అయితే ఐపీఎల్ చెల్లింపుల పక్రియ ఎలా వుంటుందంటే.. సీజన్ స్టార్ట్ అయ్యే వారం ముందు 15శాతం సీజన్ జరుగుతున్నపుడు 65 శాతం మిగిలిన 20శాతం సీజన్ ముగింపు లో ఆటగాళ్లకు అందుతుంది. అయితే ఈఏడాది అసలు ఐపీఎల్ ఉంటుందో లేదో తెలియక పోవడంతో ప్రాంఛైజీలు ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఒకేవేళ సీజన్ మొత్తానికే వాయిదాపడితే ఆటగాళ్లకు జీతాల్లో భారీ కోత తప్పదని ఓ ఐపీఎల్ ప్రాంఛైజీ సభ్యుడు వెల్లడించాడు. దాంతో ఒకవేళ ఈఏడాది ఐపీఎల్ క్యాన్సల్ అయితే మాత్రం అంతర్జాతీయ ఆటగాళ్ల తోపాటు దేశవాళీ క్రికెటర్లు కూడా భారీగా నష్టపోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: