సరిగ్గా తొమ్మది సంవత్సరాల క్రితం ఇదే రోజున కొన్ని కోట్ల భారతీయల కల నెరవేరింది.. 1983లో మొదటి ప్రపంచ కప్ అందుకున్న భారత్  2011 లో ఆ కలను మరోసారి సాకారం చేసుకుంది. 2011 ఏప్రిల్ 2 న ముంబై లోవాంఖడే లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్  మ్యాచ్ ను టీమిండియా అభిమానులు ఎప్పటికి మర్చిపోరు. శ్రీలంక - ఇండియా తలపడిన ఈ ఫైనల్ లో సిక్స్ కొట్టి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 28 ఏళ్ళ తరువాత భారత్ కు మళ్ళీ కప్ అందించాడు. ఈమ్యాచ్ ను గుర్తుచేసుకుంటూ ప్రస్తుతం హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తదితరులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 
 
ఇక ఈమ్యాచ్ ను మళ్ళీ చూడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. స్టార్ స్పోర్ట్స్ 1 ఈ ఫైనల్ మ్యాచ్ ను బాల్ టు బాల్ రీ టెలికాస్ట్ చేయనుంది. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ఈమ్యాచ్ ప్రసారం కానుంది. ప్రస్తుతం కరోనా వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో బయటికి వెళ్ళడానికి వీలులేదు కాబట్టి  ఈ మ్యాచ్ కు రికార్డు స్థాయిలో టీఆర్పీ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఐసీసీ ఫేస్ బుక్ లో కూడా ఈమ్యాచ్ మధ్యాహ్నం 2:30గంటల నుండి స్ట్రీమ్ కానుంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: