కరోనాను కట్టడి చేయడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రకాల  చర్యలను తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం నేషన్ వైడ్ గా 21 రోజులు లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి కీలక సూచనలు చేస్తున్నారు. ఇక నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ లాక్ డౌన్ ను పక్కగా అమలు చేయాలని ముఖ్యమంత్రులకు సూచించగా  ఈరోజు ఉదయం వీడియో ద్వారా కరోనా పై చిన్న సందేశాన్ని ఇచ్చారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతి ఇంట్లో లైట్ లను ఆపేసి 9 నిమిషాల పాటు కొవ్వొత్తులతో లేదా సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ లను ఆన్ చేసి కరోనా చీకట్లను పారదోరాలని పిలుపునిచ్చారు. 
 
ఇక ఇదిలావుంటే కొద్దీ సేపటి క్రితం ప్రమఖ క్రీడాకారుల తో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పై వీడియోల ద్వారా ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ఈ కాన్ఫరెన్స్ ద్వారా మోదీ కోరారు. ఇప్పటికి చాలా మంది కరోనా ను సీరియస్ గా తీసుకోవడం లేదు లాక్ డౌన్ నిబంధలను ఉల్లంగిస్తున్నారు తద్వారా దేశం మరింత ప్రమాదం లో పడే అవకాశం ఉందని అందుకే సామజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు పూర్తి అవగాహన కలిపించాలని క్రీడాకారులను కోరారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుతో పాటు 49మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో గంగూలీ , సచిన్, కోహ్లీ , పీవీ సింధు, విశ్వనాథ్ ఆనంద్, మేరీ కోమ్ , హిమదాస్ తదితరులు వున్నారు. 
 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈక్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: