వైవిధ్య‌మైన బౌలింగ్ యాక్ష‌న్‌తో టీమిండియా స్టార్ పేస‌ర్ బుమ్రా ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. దేశాల‌కు అతీతంగా ఈ స్టార్ బౌల‌ర్‌ను అభిమానిస్తుండ‌టం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ వా బ్రుమా బౌలింగ్‌లో ఒక్క ఓవ‌ర్ అయినా ఆడాల‌ని  ఉందంటూ అప్ప‌ట్లో మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టాడు. అలాగే ఒక‌ప్ప‌టిక స్టార్ బౌల‌ర్ మెక్‌గ్రాత్ బ్రూమా బౌలింగ్ ఎంతో బావుటుంది..యాక్ష‌న్‌తో పాటు యార్క‌ర్ అంటే బ్రుమా గుర్తుకు వ‌స్తాడంటూ కొనియాడాడు. ఇక ఇండియాలో అయితే బ్రుమాకున్న అభిమానుల సంఖ్య కోట్ల‌లో ఉందంటే అతిశేయోక్తికాదు. సాధార‌ణంగా బ్యాట్స్‌మెన్‌కు అభిమానుల సంఖ్య ఎ క్కువ‌గా ఉంటుంది.

 కానీ త‌న చ‌క్క‌ని బౌలింగ్‌తో కోట్ల కోలాది అభిమానుల‌ను సంపాదించున్నాడు. అయితే ఇప్పుడు బుమ్రా  అభిమానుల జాబితాలో ఓ చిన్నారి కూడా చేరిపోవ‌డ‌మే కాదు..బ్రుమాకే నువ్వు ఇలా బౌలింగ్ చేస్తావు తెలుసా అంటూ ఈ యువ పేస‌ర్ ఎదుటే బౌలింగ్ చేసి మ‌రీ చూపింద‌ట‌. ఇంత‌కీ ఆ చిన్నారి ఎవ‌రనుకుంటున్నారా..? ట టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ కూతురు స‌మైరా. ఇటీవ‌ల బుమ్రా రోహిత్ శ‌ర్మతో క‌ల‌సిన‌ప్పుడు స‌ర‌దాగా కొద్దిసేపు గ‌డిపాడట‌. ఈ స‌మ‌యంలో రోహిత్‌ శర్మ తన కూతురు సమైరాతో సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలో రోహిత్‌ సతీమణి రితికా బుమ్రా ఎలా బౌలింగ్‌ చేస్తాడని సమైరాను అడిగింది. 

 

దీంతో వెంటనే బుమ్రా యాక్షన్‌ను అనకరించడంతో రోహిత్‌, రితికాలు బ‌ల్లున న‌వ్వేశార‌ట‌. బుమ్రా ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిమానుల‌తో ట్విట్ట‌ర్లో పంచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్‌గా మారాయి. ఈ వీడియోను బుమ్రా తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘నా కంటే సమైరానే బాగా చేసిందనుకుంటున్నా. ఆమె నన్ను అభిమానించే కంటే నేనే ఎక్కువగా ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను’అని కామెంటులో పేర్కొన్నాడు.  క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండియ‌న్ క్రికెట‌ర్లు క్వారంటైన్‌లో ఉంటూనే కుటుంబ‌స‌భ్యుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: