ఈ సంవత్సరం భారత్ వేదికగా నవంబరులో జరగాల్సిన ఫిఫా అండర్-17 మహిళా వరల్డ్‌ కప్ కాస్త కరోనా పుణ్యమా అని వాయిదా పడింది. ఇలా ఇది ఒక్కటే కాదు ఇదివరకే 2020 టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదాపడగా, అక్కడ జరగాల్సిన వింబుల్డన్ టోర్నీని కూడా వారు రద్దు చేశారు. ఇక అలాగే మన IPL విషయానికి వస్తే మార్చి 29 నుంచి మొదలవాల్సిన ఐపీఎల్‌ - 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదా కాగా ఇప్పుడు ఆ టోర్నీ కూడా రద్దయ్యే సూచనలు పూర్తిగా కనిపిస్తున్నాయి.

 

 

 
కాకపోతే ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్‌ కి భారత్‌ మొదటిసారి ఆతిథ్యమిస్తుండగా అందుకోసం కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్ లను వేదికగా మ్యాచ్‌ లు జరిగేలా షెడ్యూల్ ని రూపొందించారు కమిటీ సభ్యులు. ఇకపోతే ఆతిథ్య హోదాలో భారత జట్టు  మామూలుగానే టోర్నీలో ఆడేందుకు అర్హత పొందగా ఇందులో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. కాకపోతే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తీవ్ర స్థాయికి చేరడంతో నవంబరు 2 నాటికి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోయే సూచనలు ఉన్నాయని భావించిన ఫుట్‌బాల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ టోర్నీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: