క‌రోనా వైర‌స్ పేస్ బౌల‌ర్ల‌ను వెంటాడుతోందా..?  వారి ఫిట్‌నెస్‌ను దెబ్బ‌తీస్తోందా..?   కెరీర్‌ప్ తీవ్ర ప్ర‌భావం చూపుతోందా..? అంటే ప‌లువురు విశ్లేష‌కులు మాత్రం ఔన‌నే అంటున్నారు. దేశ‌వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నేప‌థ్యంలో అన్నిరంగాల‌కు చెందిన‌వారంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దాదాపుగా అడుగుబ‌య‌ట‌పెట్ట‌డం లేదు. సినీతారులు అయితే హాయిగా ఇళ్ల‌లో కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతున్నారు. క్రికెట‌ర్లు కూడా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అయితే.. ఇళ్ల‌లో ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు వ్యాయామం చేస్తున్నారు. నిజానికి.. చాలా మంది ప్ర‌ముఖుల‌కు ఇళ్ల‌లోనే ప్ర‌త్యేక‌మైన జిమ్స్ కూడా ఉంటాయి.  ఇక్క‌డ స‌మ‌స్య ఏమిటంటే.. ఒక్క బౌల‌ర్ల ప‌రిస్థితి మ‌రింత ప్ర‌త్యేక‌మైది. వారు ఇళ్ల‌లో ప్రాక్టీస్ చేసుకునే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది.. నిజానికి ఉండ‌ద‌నే చెప్పొచ్చు. వారి ఫిట్‌నెస్ కేవ‌లం ప‌రుగు తీయ‌డంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ.. ఇళ్ల‌లో ప‌రుగుతీసే అవ‌కాశం ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో భార‌త్ మాజీ క్రికెట‌ర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో బౌల‌ర్ల గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. 

 

 లాక్‌డౌన్ వ‌ల్ల పేస్‌బౌల‌ర్లు ఫిట్‌నెస్ కాపాడుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అశిష్ నెహ్రా అభిప్రాయ‌ప‌డ్డారు. లాక్‌డౌన్‌తో ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వ‌డం వ‌ల్ల  క్రికెట‌ర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొన్నాడు. *బ్యాట్స్‌మెన్ అయితే  యోగా, బ‌రువులు ఎత్త‌డం ద్వారా ఫిట్‌నెస్ కాపాడుకోవ‌చ్చు. మ‌రింత‌ మెరుగుప‌ర్చుకోవ‌చ్చు, కానీ బౌల‌ర్ల ప‌రిస్థితి అలా ఉండ‌దు. ప్ర‌తి రోజు ప‌రుగు తీస్తేనే పేస‌ర్లు త‌మ ఫిట్‌నెస్‌తోపాటు ల‌య‌ను కాపాడుకునేందుకు అవ‌కాశ‌ముంటుంద‌ని ఆయ‌న‌ అన్నాడు. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల వ‌ల్ల జూలై వ‌ర‌కు క్రికెట్ టోర్నీలు మొద‌ల‌య్యే అవ‌కాశాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఒక వేళ ఏప్రిల్‌ 15 త‌ర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసినా..సాధార‌ణ జ‌న‌జీవితంలోకి వ‌చ్చేందుకు ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది* అని ఆశిష్ నెహ్రా అన్నారు.  అందుకే బౌల‌ర్లు వీలైనంత ప‌రుగుకు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తూ ఫిట్‌నెస్ కాపాడుకోవాలని ఆయ‌న సూచించారు. దీనికి తోడు చాలా మంది పేస‌ర్ల‌కు ప‌రుగు తీసేంతా స్థ‌లం కూడా ఇండ్ల‌లో లేక‌పోవ‌చ్చున‌ని..  ఒక‌వేళ‌ గార్డెన్‌లో 15 నుంచి 20 మీట‌ర్ల దూరం ఉన్నా..అందులో ప్రాక్టీస్ చేస్తే మంచిద‌ని నెహ్రా సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: