కరోనా పై పోరు కోసం సినీ , పారిశ్రామిక వేత్తల తోపాటు టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా విరాళాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సచిన్, కోహ్లీ ,రోహిత్ , శిఖర్ ధావన్, సురేష్ రైనా తదితరులు విరాళం ప్రకటించగా తాజాగా ఈ జాబితాలో  టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ కూడా చేరాడు. యువీ తన వంతు సాయంగా పీఎం కేర్స్ ఫండ్ కు 50లక్షల విరాళాన్ని ప్రకటించాడు. అంతేకాదు ఈ సందర్భంగా ఎవరికి తోచినంత వారు విరాళాలు ఇవ్వాలని అభిమానాలను కోరాడు.
 
ఇక మాజీ ఓపెనర్ , ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఎంపీ నిధుల నుండి కోటి రూపాయలను మాస్క్ లు,పిపిఈ కిట్లు కొనడానికి వాడుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను  కోరాడు. ఇంతకుముందే  గంభీర్ ప్రధాన మంత్రి సహాయ నిధికి 50లక్షల విరాళం ప్రకటించాడు. మరోవైపు అందరు స్పందిస్తున్న ధోని నుండి ఎలాంటి రెస్పాన్స్  రాకపోవడం అభిమానులను ఆశ్ఛర్యానికి గురి చేస్తుంది. విరాళం కాదు కదా  ఇంతవరకు  కరోనా గురించి ధోని ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు.  
 
అయితే కరోనా వల్ల పూణేలో పనిలేక ఆవస్థలు పడుతున్న వారికి ధోని లక్ష రూపాయల సాయం చేశాడని ఇటీవల వార్తలు వచ్చాయి దాంతో అంత పెద్ద క్రికెటర్  కేవలం లక్ష రూపాయలు సాయం చేయడమేంటని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అయితే ధోని సతీమణి సాక్షి  ఆ వార్తలను కొట్టి పారేసింది. మరి ధోని ఇకముందైనా స్పందిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: