షేన్ వార్న్‌... ఈ పేరు గురించి పీడగా చెప్పాల్సిన అవసరం లేదు క్రికెట్ అభిమానులకి. ఎందుకంటే... టెస్టు క్రికెట్‌ లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌ షేన్ వార్న్‌. ఇలా షేన్ వార్న్‌ పై సచిన్‌ పైచేయి సాధించిన సందర్బాలు అనేకం. కాకపోతే అదే సమయంలో సచిన్‌ పై కూడా వార్న్‌ ఆధిక్యం చెలాయించిన మ్యాచ్‌ లు కూడా ఉన్నాయి అనుకోండి అది వేరే లెక్క. అయితే షేన్ వార్న్‌ చేసిన ఒక ట్వీట్ పోస్ట్ ఆసక్తిని రేపుతోంది క్రికెట్ అభిమానులలో. ఇక అసలు విషయానికి తెలిస్తే...

 

 

1998 సంవత్సరంలో చెన్నై వేదికగా ఆసీస్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సచిన్‌ టెండూల్కర్‌ తొలి ఇన్నింగ్స్‌ లో కాస్త విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌ లో వీర బాదుడు బాదాడు. ఆ టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌ లో వార్న్‌ బౌలింగ్‌ లో సచిన్‌ కేవలం నాలుగు పరుగుల వద్ద ఉండగా క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఇక రెండో ఇన్నింగ్స్‌ లో మాత్రం సచిన్‌ వీరవిహారం చేసి 155 పరుగులు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు మన లిటిల్ మాస్టర్. 

 

 


కాకపోతే, ఆనాడు అంపైర్‌ తప్పిదంతో సచిన్‌ మొదట్లోనే ఔటయ్యే ఛాన్స్ నుంచి తప్పించుకున్నాడనే తలంపుతో ఇప్పుడు వార్న్‌ దానికి సంబంధించిన ఒక వీడియోని పోస్ట్‌ చేశాడు. దీనిని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసాడు. అప్పుడు వార్న్‌ అప్పీల్‌ చేసినా దాన్ని ఫీల్డ్‌ అంపైర్‌ తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు చెప్పండి.. నిజానికి ఇది "ఔటా.. నాటౌటా?" అంటూ ఒక వీడియో ని క్రికెట్ అభిమానుల ముందుకి షేర్ చేసాడు. ఇది ఎలా నాటౌట్‌ అన్న విషయాన్ని తెలపాలంటూ సవాల్‌ చేసాడు. మొత్తానికి షేన్ వార్న్‌... ‘ ఇది నిజంగా చాలా సీరియస్‌ విషయం. కమాన్‌ చెప్పండి.. అది ఎలా నాటౌట్‌’ అంటూ ప‍్రశ్నించాడు క్రికెట్ అభిమానులని.

మరింత సమాచారం తెలుసుకోండి: