క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచం స్తంభించిపోయింది. ఇప్ప‌టికే సుమారు 60వేల మందికిపైగా మ‌ర‌ణించారు. ఇక ల‌క్ష‌ల మంది వైర‌స్‌బారిన‌ప‌డ్డారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి అనేక దేశాలు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఇప్ప‌ట్లో త‌గ్గే అవ‌కాశాలు కూడా క‌నిపించ‌డం లేదు. రోజురోజుకూ వైర‌స్ ప్ర‌భావం పెరుగుతూనే ఉంది. ఇక ప‌లు యూర‌ప్ దేశాలు, అమెరికాలో అయితే.. కొవిడ్‌-19 బీభ‌త్సం సృష్టిస్తోంది. ద‌వాఖాన‌ల్లో ఎటుచూసినా శ‌వాలే క‌నిపిస్తున్నాయంటూ వార్త‌లు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఉంటున్నారు. క్రీడాకారులు, సినీతారలు.. ఇలా అనేక రంగాల ప్ర‌ముఖులు, కార్మికులంద‌రూ ఇళ్ల‌లోనే ఉంటున్నారు. ఇదే క్ర‌మంలో దాదాపుగా అన్ని ఉత్పాద‌ర రంగాలేకాదు.. క్రీడా రంగాలూ దెబ్బ‌తింటున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లు క్రీడా టోర్నీలు కూడా ర‌ద్దు అయ్యాయి. 

 

ఇప్ప‌టికే టోక్యోలో నిర్వ‌హించ‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్ క్రీడ‌లు కూడా ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే. ఇదే వరుస‌లో ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ స‌మాఖ్య కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్ర‌భావం కొనసాగుతుండటంతో... జూలై వరకు అంతర్జాతీయ టోర్నమెంట్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించింది. టోర్నీ ఆతిథ్య సంఘాలతో, ఆయా దేశాల సమాఖ్యలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్‌ తెలిపింది. రద్దయిన టోర్నీల్లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (జూన్‌ 2–7), థాయ్‌లాండ్‌ ఓపెన్‌ (జూన్‌ 9–14), ఇండోనేసియా ఓపెన్‌ (జూన్‌ 16–21), రష్యా ఓపెన్‌ (జూలై 7–12) ఉన్నాయి. అలాగే.. మరోవైపు మే నెలలో భారత్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ షూటింగ్‌ టోర్నమెంట్‌లను... మ్యూనిచ్, బాకు నగరాల్లో జూన్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య తెలిపింది. క‌రోనా క‌ట్ట‌డికి 

 

మరింత సమాచారం తెలుసుకోండి: