ప్రస్తుత జనరేషన్ మొత్తం ఎక్కువగా మాట్లాడుకునేది మాజీ భారత  కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ల కెప్టెన్సీ  గురించి అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో ఇద్దరి కెప్టెన్సీని  పోల్చి చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. కొన్ని కొన్ని సార్లు కోహ్లీ కెప్టెన్సీ రైట్ అంటుంటే.. కొన్ని కొన్ని సార్లు ధోనీ కెప్టెన్సీ బెటర్ అంటూ ఉంటారు. ఏదేమైనా ఈ ఇద్దరు కెప్టెన్ మాత్రం భారత్ ఎన్నో విజయాలను అందించారు. అయితే తాజాగా టీమిండియా జట్టుకు కెప్టెన్సీ వహించే విషయంలో  మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. అగ్రెసివ్  విరాట్ కోహ్లీ మధ్య అసలు పోలికే లేదు అంటూ భారత జట్టు ఒకప్పటి  మెంటల్ కండిషన్ కోచ్ ప్యాడి అప్టాన్  అభిప్రాయం వ్యక్తం చేశారు. 2011 వన్డే ప్రపంచ కప్ సమయంలో... టీమిండియా తో కలిసి మెంటల్ కోచ్గా పనిచేసిన ఈయన... ఇద్దరు కెప్టెన్సీ ల  గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. 

 

 

 కోహ్లీ అప్పట్లో ఫిట్నెస్ పై  ఎక్కువ దృష్టి పెట్టడం కారణంగానే విరాట్ కోహ్లీ కెరియర్ అనూహ్యంగా మలుపు తిప్పింది అంటూ ప్యాడి  అంప్టాన్ ఓ ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చాడు. అయితే కెప్టెన్సీ విషయంలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం... మైదానం లో ఎలాంటి హావభావాలు చూపించకుండా... సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడని... కానీ కోహ్లీ మాత్రం ఎంతో ఎమోషనల్ కెప్టెన్  అంటూ చెప్పుకొచ్చాడు ప్యాడి . ప్రతి మనిషిని కోహ్లీ ఎమోషనల్ గా  తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 

 అందుకే మహేంద్రసింగ్ ధోని విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మధ్య చాలా తేడాలు ఉంటాయి అంటూ తెలిపాడు. మైదానంలో ఎంతో స్ట్రాంగ్ గా... సైలెంట్ గా తన పని తానూ చేసుకు పోతుంటాడు... విరాట్ కోహ్లీ మాత్రం తన హావభావాలతో సహచరుల్లో  సైతం ఎంతో ఎనర్జీ నింపుతూ ఉంటాడు అంటూ ఆప్టన్  చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన ఎనర్జీతో స్ఫూర్తివంతమైన మాటలతో... జట్టులోని ప్రతి ఆటగాడి  దగ్గర నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టగల సత్తా కోహ్లీ సొంతం అంటూ తెలిపాడు. అయితే కెరీర్ ఆరంభంలో ఎంతగానో బరువు పెరిగిన  విరాట్ కోహ్లీ ఆతర్వాత ఫిట్నెస్ పై  దృష్టి పెట్టి కెరీర్ ను  మలుపు తిరిగేలా  చేసుకున్నాడు అంటూ ప్యాడి అంప్టాన్  వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: