మనదేశంలో క్రికెట్ కి ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. క్రికెట్ తర్వాత అంతగా ఆదరణ పొందేది సినిమానే కావచ్చు. అయితే భారతదేశం తరపున ఒక ఆటగాడికి అవకాశం రావడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. మనదేశంలో ఉండే కాంపిటీషన్ కి అవకాశం రావడం చాలా కష్టం. భారతదేశం తరపున ఆడే అదృష్టం కొంతమందికే ఉంటుంది. ఎంతో మంది అవకాశం కోసం ఎదురుచూస్తున్న అది తలుపు తట్టేది మాత్రం కొందరికే.

 

 

అయితే ఒక్క అవకాశం రావడమే కష్టం అనుకుంటే, ఒకే ఇంట్లోంచి ఇద్దరు ప్లేయర్లు ఇండియాకి ఆడటం అంటే వాళ్లెంత అదృష్టం చేసుకుని ఉంటారో కదా.. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్... వీరిద్దరూ ఇండియా తరపున ఆడారు. టీనేజ్ లోనే  ఇండియా తరపున అవకాశం వచ్చిన ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్. యూసఫ్ కి తమ్ముడైన ఇర్ఫానే ముందుగా ఇండియా తరపున ఆడాడు.

 

 


మొదటగా బౌలర్ గా అరంగేట్రం చేసిన ఇర్ఫాన్, బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. ఇండియా తరపున వన్డేలతో పాటు టెస్టులు కూడా ఆడిన ఇర్ఫాన్ పఠాన్ టాప్ బౌలర్ గా కొనసాగాడు. కానీ బౌలర్ గా రాణిస్తున్న సమయంలో బ్యాటింగ్ మీద దృష్టి పెట్టడంతో బౌలింగ్ లో విఫలమవుతూ వచ్చాడు. ఆ తర్వాత యూసఫ్ పఠాన్ ది కూడా సేమ్ సిట్యుయేషన్. యూసఫ్ పఠాన్ ఇండియా తరపున ఆడింది తక్కువ మ్యాచులే అయినా తనదైన ముద్ర కనబరిచాడు.

 

 

 

ఇద్దరూ మంచి ఆటగాళ్లే అయినప్పటికీ అదృష్టం అంతగా కలిసి రాక  ఇండియా టీమ్ లో స్థిరమైన ప్లేయర్ గా కొనసాగలేకపోయారు. ఐపీఎల్ లోమ్నూ తమ సేవలు కొనసాగిస్తున్న వీరిద్దరూ వారి ఆట ద్వారా మరిన్ని అనుభూతులు పంచుదారని ఆశిద్దాం.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: