ప్రస్తుతం కారణం వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఐపీఎల్ 2020 వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిజానికి షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉండగా కానీ కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15 కు వాయిదా పడింది. ఇదిలా ఉండగా దేశంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఐపీఎల్ సీజన్ జరగడంపై అందరిలోనూ ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. అనుకోని పరిస్థితుల్లో ఐపీఎల్ రద్దయితే బీసీసీఐకు రెండు వేల కోట్లు నష్టం వాటిల్లుతుందని ఒక అంచనా వేస్తున్నారు. 

 


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో క్రికెట్ సిరీస్ లన్నీ రద్దు కావడంతో కొన్ని క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు పూర్తి జీతాలు చెల్లించలేక పోయాయి. కానీ బిసిసిఐ మాత్రం  భారత క్రికెటర్ల అందరికీ వారి జీతాలు మొత్తాన్ని చెల్లింపులు చేసింది. అంతేకాకుండా బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న ఆటగాళ్లకు కూడా పూర్తి మొత్తంలో చెల్లింపులు చేశాయి. దీనితో పాటు మార్చి 31 వరకు టీమిండియా భారత్ - ఏ జట్టు కి జరిగిన అన్ని మ్యాచులకు కూడా చెల్లింపులు జరిగాయని బీసీసీఐ అధికారి తెలపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: