ప్రస్తుతం దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ పరిస్థితులలో సురక్షితంగా ఉండాలంటే కేవలం ఇంటికి మాత్రమే ప‌రిమితం కావాల్సిందేనని, మ‌రో మార్గం లేద‌ని టీమిండియా వైస్ కెప్టెన్ "రోహిత్ శ‌ర్మ" తెలిపాడు. కరోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌పంచ నలుమూలల క్రీడా టోర్నీల‌న్నీ ర‌ద్దైన విష‌యం అందరికి తెలిసిందే. కాకపోతే భారత దేశంలో లాక్‌ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో అందరూ వారి ఇంటికే ప‌రిమిత‌మైన క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా వారి అభిమానుల‌కు సూచనలను ఇస్తున్నారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Being homebound is no excuse, stay fit, stay in, stay safe 💪

A post shared by rohit Sharma (@rohitsharma45) on


ఈ పరిస్థితులలో రోహిత్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. తన బాల్కానీలో కూర్చోని షూ లేస్ కట్టుకుంటున్న ఫొటో కి ‘ఇంట్లో ఉండ‌టం త‌ప్ప వేరే మార్గం లేదు. ఇంట్లో ఉండండి.. ఫిట్‌గా ఉండండి.. సేఫ్‌గా ఉండండి' అని క్యాప్షన్ అందులో ఇచ్చాడు. ఇప్ప‌టికే టీమిండియా ఏస్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, మాజీ ఆల్‌ రౌండ‌ర్ యువరాజ్ సింగ్‌ తో ఇన్‌ స్టాగ్రామ్‌ లో లైవ్ నిర్వ‌హించిన‌ రోహిత్ తాజాగా అభిమానుల‌కు ఇంట్లోనే ఉండమ‌ని తగు సూచనలు ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: