భారత మాజీ కెప్టెన్... టీమిండియా డేర్ అండ్ డాషింగ్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాకు రెండు ప్రపంచకప్ లను  అందించిన ఏకైక కెప్టెన్ గా టీమిండియా చరిత్రలో తన పేరును దక్కించుకున్నాడు. ఇక తనదైన కెప్టెన్సీ తో  టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. జట్టును ముందుండి నడిపిస్తు ఎన్నోసార్లు తనదైన అద్భుత ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు వైపు నడిపించాడు. అయితే గత కొంత కాలంగా ధోని క్రికెట్ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ లో  న్యూజిలాండ్ తో ఓటమి తర్వాత ధోనీ పూర్తిగా క్రికెట్కు దూరం అయిపోయాడు. కనీసం మైదానంలో కూడా ఒక్కసారి కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ ఖాయం అనే వార్తలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 

 

 

 సోషల్ మీడియా వేదికగా ఎన్నో వార్తలు ధోనీ రిటైర్మెంట్ పై వచ్చాయి ఇక ధోనీ రిటైర్మెంట్ పై ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు కూడా స్పందిస్తూ ధోని రిటైర్మెంట్ పై తమ  అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ధోనీ రిటైర్మెంట్ పై వార్తలు వెళ్లువెవెత్తుతున్న  వేల ఇంగ్లాండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ ధోని కి అండగా నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప ఆటగాడు అంటూ ప్రశంసించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్.. అలాంటి గొప్ప ఆటగాడు తరానికి ఒక్కడు మాత్రమే ఉంటాడు అంటూ ప్రశంసించాడు. అలాంటి ఆటగాడిని ముందుగానే రిటైర్మెంట్ లో కి నెట్టొద్దు  అంటూ అందరికీ సూచించాడు నాసిర్ హుస్సేన్. భారత క్రికెట్ కు  మహేంద్రసింగ్ ధోని చేయాల్సింది ఇంకా చాలానే ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 

 ధోనీ ఒక్కసారి వెళ్ళి పోయాడు అంటే మళ్లీ వెనక్కి తీసుకు రావడం కష్టం అంటూ తెలిపాడు. ఆటలో కొందరు మాత్రమే లెజెండ్స్ ఉంటారని ... అలాంటివారు తరానికి ఒక్కరు మాత్రమే ఉంటారని... ధోని అలాంటి ఆటగాడే అంటూ ప్రశంసించాడు. ధోని  మానసిక స్థితి ఏమిటో ధోనికి  మాత్రమే తెలుసు అలాంటిది మీరు ముందుగానే ధోని ని  రిటైర్మెంట్ లోకి  నెట్టొద్దు  అంటూ నాసిర్ హుస్సేన్ పేర్కొన్నాడు. అయితే అంతకు ముందు ఎంతో మంది ప్రముఖులు  కూడా ధోనీకి అండగా నిలుస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ గురించి ఎలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని... తన రిటైర్మెంట్ గురించి ధోనీకి వదిలేద్దాం అంటు  చాలామంది వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: