భారత్ లో  క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... అయితే క్రికెట్ తర్వాత భారత ఎక్కువ క్రేజ్ సంపాదించిన ఆట ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కబడ్డీ. ప్రస్తుతం కబడ్డీ  సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షిస్తుంది. కబడ్డీ లో సత్వరంగా ఎత్తులు పై ఎత్తులు... డూ ఆర్ డై రైడ్లు ... అదిరిపోయే టాకీళ్లు ...హోరా హోరి పోరు  ఇలా మొత్తం రసవత్తరంగా సాగిపోతూ ఉంటుంది. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందుతోంది కబడ్డీ లో. ప్రతిక్షణం ఉత్కంఠగా మారిపోతుంది... ప్రతి రైడ్ కళ్లార్పకుండా చేస్తుంది . అయితే కబడ్డీ ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ల  నుంచి భారతదేశంలో గ్రామీణ ఆటగా  ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే. అయితే కబడ్డీ మారుపేరుగా ఉన్న భారత్ 2010 సంవత్సరంలో ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో విజయం సాధించింది. 

 

 

 లుధియానాలో జరిగిన ఈ ప్రపంచ కప్ కబడ్డీ 2010 పోటీలలో ఫైనల్లో గెలుపొంది టైటిల్ సొంతం చేసుకోవడం ఇండియాకు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పైన విజయం సాధించింది భారత్. ఫైనల్స్ లో తలపడిన  భారత్   పాకిస్థాన్ ను  చిత్తుగా ఓడిస్తూ  సంచలన విజయాన్ని నమోదు చేసింది భారత్. 58-24 పాయింట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో గెలవడంతో టీమిండియా కోటి  రూపాయిల ప్రైజ్ మని  సొంతం చేసుకుంది. రన్నరప్ గా  నిలిచిన పాకిస్థాన్ జట్టు  50 లక్షలతో మాత్రమే సర్ది పెట్టుకుంది. అయితే 2010 కబడ్డీ ప్రపంచ కప్ పోటీలలో భారత్ కేవలం ఫైనల్ లోనే కాదు మొదటి లీగ్ మ్యాచ్ నుండి  సత్తా చాటుతూ దూసుకుపోయింది. 

 

 

 ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ కబడ్డీ ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్ పాకిస్థాన్ లతోపాటు ఇంగ్లాండ్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా స్పెయిన్ జట్లు పాల్గొన్నాయి. అయితే లీగ్ దశ నుంచే సత్తా చాటుతూ దూసుకుపోయిన భారత జట్టు... లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ అజేయంగా నిలిచి సెమీ ఫైనల్స్ కు  చేరుకున్నారు. సెమీఫైనల్స్ లో  కెనడా తో తలపడి 57-36 తేడాతో విజయం సాధించింది భారత కబడ్డీ జట్టు. ఆ తర్వాత ఫైనల్ లో అడుగుపెట్టిన భారత జట్టు చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో తలపడింది. లీగ్ దశలో నుంచి చెలరేగి ఆడి భారత సత్తా ఏంటో చూపిన టీమ్ ఇండియా జట్టు ఫైనల్లో ను విజృంభించింది. అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ లో తమకు తిరుగు లేదు అంటూ నిరూపించింది భారత కబడ్డీ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: