ప్రస్తుత భారత క్రికెట్లో టీమిండియా మాజీ సారధి... వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోని  పూర్తిగా క్రికెట్ కు  దూరం అయిపోయాడు. దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా  ఇప్పటివరకు ఒక్క సారి కూడా మైదానంలోకి అడుగుపెట్టిన బ్యాట్  పట్టింది లేదు.ఈ క్రమంలోనే  ధోనీ రిటైర్మెంట్ గురించి ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. క్రికెట్ దిగ్గజాలు ధోని  రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజురోజుకూ ధోని  కెరియర్ పై జరుగుతున్న చర్చ ముదురుతూ వస్తోంది. 

 

 

 అయితే తాజాగా టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ గురించి పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ రిటైర్మెంట్ కు సంబంధించిన అంశాన్ని ఇంతదూరం ఎందుకు తీసుకువచ్చారు అనే దానిపై తాను లోతుగా ఆలోచించదలుచుకోలేదని.... కానీ టీమిండియా క్రికెట్లో దిగ్గజ ఆటగాదైన మహేంద్రసింగ్ ధోని 2019 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే ఎంతో  బాగుండేది అంటూ పాక్  ఫాస్ట్ బౌలింగ్ క్రికెటర్ షోయబ్ అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 ధోని లాంటి గొప్ప క్రికెటర్ కు సముచిత స్థాయిలోనే వీడ్కోలు లభించాలి అని తాను ఆశిస్తున్నట్లు అక్తర్ వ్యాఖ్యానించారు. మహేంద్రసింగ్ ధోని సారథిగా ఆటగాడిగా సర్వశక్తులూ ఒడ్డి భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించాడని... రెండు ప్రపంచ కప్ లను  భారత్ కి అందించాడు అంటూ తెలిపారు. అందుకే అంత గొప్ప అతగాడికి  అంతే గొప్పగా ఆటనుండి తప్పుకోవాలి  అంటు  సూచించాడు. కానీ ముఖ్యంగా ధోని  ఈ విషయాన్ని ఎందుకు ఇంత సాగదీస్తున్నాడో  అర్థం కావడం లేదు అంటూ వ్యాఖ్యానించాడు పాకిస్తాన్ క్రికెట్  దిగ్గజం అక్తర్.  ఒకవేళ ధోని స్థానంలో తాను  ఉంటే ఈపాటికి రిటైర్మెంట్ ప్రకటించే వాడిని అంటూ  షోయబ్ అక్తర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: