మహేంద్ర సింగ్ ధోని... ఈ పేరుని మళ్లీ కొత్తగా అభివర్ణించాలిసిన అవసరం లేదనుకుంట కదా... అయితే మన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన చివరి మ్యాచ్ ని 2019 ప్రపంచకప్‌ లో న్యూజిలాండ్‌ తో జరిగిన సెమీస్‌ లో పూర్తి చేసాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అంటున్నాడు. అయితే షోయబ్ అక్తర్, ధోని రిటైర్మెంట్‌ పై స్పందిస్తూ.. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ ను ఎక్కువ కాలం సాగనిపకుండా ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. 

 


భారతదేశానికి ధోని రెండు ప్రపంచ కప్‌ లు అందించడంలో అసలు సిసలు పాత్ర పోషించాడని, దానికోసమైన ధోనిని చాలా గౌరవంతో వీడ్కోలు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్. నిజానికి ధోనీ క్రికెట్‌ కు వీడ్కోలు పలకాల్సిన అవసరం వచ్చిందని కూడా షోయబ్ అక్తర్ అంటున్నాడు. ఇప్పటికైనా ధోని ఆటకు వీడ్కొలు పలికాలని, ఇంక ఎంతకాలం ఎందుకు సాగదీస్తున్నాడో అర్థం కావట్లేదని ఆయన తెలిపారు. 

 


అయితే కరోనా వైరస్ మహమ్మారి లేకుంటే.. ఐపీఎల్‌ - 2020 సిజెన్ లో ఉత్తమ ప్రదర్శన చూపించి టీ - 20 ప్రపంచకప్ జట్టులో కచ్చితంగా చోటు సంపాదించేవాడు. అయితే, ఆ అవకాశం ధోనికి అందకుండా పోతుందేమో అనిపిస్తోంది. కాకపోతే ధోనీ 2019 ప్రపంచకప్ తర్వాత ఏదైనా చివరి సిరీస్ ఆడి గౌరవంగా తప్పుకుంటే బాగుంటది అని షోయబ్ అక్తర్ తన అభిప్రాయం తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: