వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్... ఐపీఎల్ ఈ ఏడాది నిరవధిక  వాయిదా పడింది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 13 వ సీజన్  కరోనా వల్ల ఏప్రిల్ 14 వరకు వాయిదాపడింది. అయితే ఇప్పటికీ ఇండియాలో కరోనా ప్రభావం తగ్గలేదు కదా ఇంకా పెరగడంతో లాక్ డౌన్ ను వచ్చే నెల మూడు వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించాడు దాంతో ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేస్తునట్లు  బీసీసీఐ, ప్రాంచైజీలకు సమాచారం ఇచ్చిందని ఓ అధికారి పేర్కొన్నాడు. ఇక వేసవి లో కుదురుకపోతే ఐపీఎల్ ను ఈఏడాది  చివర్లో  నిర్వహించాలని బీసీసీఐ వేసిన ప్లాన్ కూడా వర్క్ అవుట్ అవ్వడం కష్టమేనని తెలుస్తుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్ పూర్తిగా రద్దు కావడం ఇదే తొలిసారి కానుంది. ఈసీజన్ ను వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. 
 
ఈఏడాది ఐపీఎల్ పూర్తిగా రద్దయితే  బోర్డు ఏకంగా 2000 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుండగా ఐపీఎల్ ప్రాంచైజీలు 100కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోనున్నాయి. ఆటగాళ్లకు ఈ సారి ప్రాంఛైజీలు జీతాలు చెల్లించడం లేదని సమాచారం. ఇక గత  ఏడాది వన్డే ప్రపంచ కప్ తరువాత క్రికెట్ కు దూరంగా ఉంటున్న టీమిండియా మాజీ సారథి ధోని  ఈఏడాది ఐపీఎల్ తో రీ ఎంట్రీ ఇస్తాడని ఎదురుచూసిన అతనికి ఫ్యాన్స్ కు కరోనా షాక్ ఇచ్చింది. ఇదిలావుంటే ఐపీఎల్ తో పాటు ఈఏడాది ఆస్ట్రేలియా లో జరుగునున్న టీ 20 ప్రపంచ కప్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: