మహేంద్రసింగ్ ధోని ఇప్పుడు ఈ పేరు చెప్తే ఒకే ఒక మాట అతని రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటిస్తాడు అని. గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ లో చివరి మ్యాచ్ ఆడగా తర్వాత ధోని గ్రౌండ్ లోకి అడుగు పెట్టలేదు. అంటే ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. దీనితో మళ్లీ ఈ సంవత్సరం జరగబోయే ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ కి వస్తాడని అందరూ భావించారు. దీని కోసం అతను ఐపీఎల్ 2020 లో తన ఫార్మ్ నిరూపించుకొని స్థానం పొందుతాడు అనుకున్నాడు. కాకపోతే కరోనా వైరస్ పుణ్యమా అని అది కాస్త వాయిదా పడింది.

 

 


ఇలా ప్రతి ఒక్కరూ ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడని చెబుతున్న నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ధోనీకి అండగా నిలిచాడు. నిజానికి వివిఎస్ లక్ష్మణ్ ధోనీపై అతని సామర్ధ్యం పై కీలక వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ కనీసం ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఐపీఎల్ అవుతాడని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. అలాగే అతనిలో ఇంకొంతకాలం ఐపీఎల్ ఆడే సత్తా ఉందని ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా మహి చాలా స్ట్రాంగ్ అని తెలిపాడు. 

 

 

మహేంద్రసింగ్ ధోని ఫిట్నెస్ ఒక రేంజ్లో ఉంటుందని వయస్సు అనేది అతనికి ఒక నెంబర్ మాత్రమేనని ధోని గురించి చెప్పుకొచ్చాడు. ధోని కి చెన్నై సూపర్ కింగ్స్ ను ఒక నాయకుడిలా ముందుకు నడిపిస్తున్నాడు అని అంటున్నాడు. అయితే ధోని టీమిండియా తరఫున ఆడే విషయంపై మాట్లాడుతూ ఆ సంగతి కొత్త సెలక్షన్ కమిటీ చేతుల్లో ఉందని లక్ష్మణ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: