దేశంలో కరోనా రోజు రోజు కు తీవ్రరూపం దాల్చుతుండడంతో ఐపీఎల్ 2020 సీజన్ ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు కొద్దీ సేపటి క్రితం బీసీసీఐ అధికారంగా ప్రకటించింది. రెండు రోజుల క్రితమే ఈ విషయాన్ని ప్రాంచైజీలకు అలాగే బ్రాడ్ కాస్టర్ల కు చేరవేసింది. ప్రజల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యంకాదు, ఇలాంటి తరుణంలో ఐపీఎల్ గురించి ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు ఈవిపత్కర పరిస్థితుల నుండి పూర్తిగా బయటపడ్డాక కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ఐపీఎల్ నిర్వహణ పై  నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించింది.
 
ఇక కరోనా లేకుంటే ఈ సీజన్ మార్చి 29న ప్రారంభం కావాల్సి వుంది కానీ కరోనా ప్రభావం ఇండియా పై కూడా పడడం తో ఏప్రిల్ 14వరకు వాయిదా వేశారు ఆలోగా పూర్తిగా తగ్గితే నిర్వహించాలనుకున్నారు కానీ రోజు రోజు కు కేసులు పెరుతుండడంతో కేంద్రం మే 3 వరకు లాక్ డౌన్ వరకు పొడిగించింది దాంతో  ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేయక తప్పలేదు. ఒకవేళ పరిస్థితి లో మార్పు రాకుంటే మాత్రం ఈ ఏడాది ఐపీఎల్ లేనట్లే.. అదే జరిగితే  ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్ పూర్తిగా రద్దు కావడం ఇదే మొదటి సారి కానుంది అలాగే సీజన్ క్యాన్సల్ అయితే బీసీసీఐ 2000కోట్ల వరకు నష్ట పోనుంది. ఇదిలావుంటే ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 12000 దాటగా 300 కు పైగా మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్ర , గుజరాత్ , రాజస్థాన్ లో ఈవైరస్ ప్రభావం ఎక్కువగా వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: