కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచంలో ఉన్న అన్ని రంగాలపై చాలానే దెబ్బ పడిందని చెప్పవచ్చు. నిర్మాణ, ఉపాధి, రవాణా, క్రీడ ఇలా ప్రతి రంగం చాలా వరకు నష్టపోయాం అని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఈ వైరస్ దెబ్బకు క్రికెట్ కి గట్టి దెబ్బ తగిలింది. ప్రపంచంలో మొత్తం 14 దేశాలు ఈ రోజు ఏదో ఒక మూలన మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు. నిజానికి ప్రస్తుతం మనదేశంలో ఐపీఎల్ ఈ సంవత్సరానికి మర్చిపోవాలనే చెప్తుంది బిసిసిఐ. నిజానికి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్లు జరిగే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కనబడట్లేదు.


అయితే ప్రపంచంలో క్రికెట్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ వంటి దేశాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీనికి కారణం ఏ మ్యాచ్ లేకపోవడం. ప్రకటనలు ఇచ్చేందుకు ఏ కంపెనీ ముందుకు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక ఆటగాళ్ల భద్రత కూడా వారి దేశాలు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. నిజానికి కరోనా వైరస్ దెబ్బకి ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా పరిస్థితి ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది.

 

 

దీనితో క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఉద్యోగాలను భారీగా తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. మామూలుగా ఈ సంవత్సరంలో పురుషుల టీ 20 వరల్డ్ కప్ జరగాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చుస్తే అది జరిగేలాలేదు. నిజానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్ పై భారీగా ఆశలు పెట్టుకుంది అని చెప్పవచ్చు. అయితే క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఆ మెగా టోర్నీ నిర్వహించడం కష్టమని మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: