ఆస్ట్రేలియా వేదిక ఈ సంవత్సరం చివర్లో జరగబోతున్న వరల్డ్ కప్ కోసం భారత జట్టులో స్థానం కొరకు వికెట్ కీపర్ గా ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని, కె.ఎల్.రాహుల్, రిషబ్ పంత్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్ గా పోటీపడుతున్నారు. ఇకపోతే తాజాగా నాలుగో వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కూడా ఆ లిస్ట్ లో చేరబోతున్నాడు. వన్డే, టెస్టులతో పోలిస్తే టీ20 లో దినేష్ కార్తిక్ కి మెరుగైన రికార్డు ఉందని తాను చెప్పుకొచ్చాడు. కాబట్టి టి20 వరల్డ్ కప్ జట్టులో తన స్థానాన్ని నేను ఆశిస్తున్నట్లు దినేష్ కార్తీక్ వెల్లడించాడు.

IHG

అయితే 2009లో జరిగిన వరల్డ్ కప్ తర్వాత ధోనీ ఆడకపోగా అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కి వరుసగా భారత సెలెక్టర్లు స్థానాన్ని కల్పించారు. అయితే ఇందులో రిషబ్ పంత్ ఫెయిల్ అవ్వగా కేఎల్ రాహుల్ మాత్రం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు అని చెప్పవచ్చు. ఈ దెబ్బతో కేఎల్ రాహుల్ ని వరల్డ్ కప్ కీపర్ గా ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు సెలెక్టర్లకి సూచనలు ఇస్తున్నారు.అయితే ఇంకో వైపు ధోనీ పేరు చెప్పేవారు కూడా లేకపోలేదు. కొన్ని అంచనాల ప్రకారం ఈ టోర్నీకి ఇద్దరు లేదా ముగ్గురు వికెట్ కీపర్ లను ఎంపిక చేసే అవకాశం ఉంది.

 


ఈ విషయంపై దినేష్ కార్తీక్ మాట్లాడుతూ టీ20 లో నాకు మెరుగైన రికార్డ్స్ ఉన్నాయి అయితే వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలలో నాకు స్థానం దక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇది వరకు 2019 వన్డే ప్రపంచకప్ లో మాత్రం నాకు అవకాశం రాకపోవడం నేను అర్థం చేసుకోవాలని కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు అని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: