గౌతం గంభీర్.... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం అతని ఆట, అంకితభావం. నిజానికి గౌతం గంభీర్ మ్యాచ్లో ఎంత అంకితభావంతో ఆడుతాడో అందరికీ తెలిసిన విషయమే. ఒక్క గ్రౌండ్ లోనే కాకుండా బయట కూడా చాలా దూకుడు స్వభావం కలవాడు. అంతేకాకుండా గౌతం గంభీర్ బయట జరిగిన చాలా సంఘటనలు తన దూకుడు స్వభావంతో చేసినవిగా  అనిపిస్తాయి.


గౌతమ్ గంభీర్ ఒక క్రికెటరే కాకుండా ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా పని చేస్తున్నాడు. ఈయన రాజకీయాల్లో కూడా తన దూకుడు స్వభావాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఈరోజు పాకిస్థాన్ అల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదిని సూచిస్తూ ఒక ట్వీట్ ని సంధించాడు గౌతం గంభీర్. ఎవరో తన వయసు గుర్తుపెట్టుకోకుండా ఉన్నారో వారికి రికార్డ్స్ అనేది ఎలా గుర్తుంటాయి అంటూ షాహిద్ అఫ్రిదీ టార్గెట్ చేస్తూ అని అన్నాడు. ఆ తర్వాత నేను గుర్తు చేస్తాను అంటూ 2007 టీ 20 వరల్డ్ కప్ లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో గౌతం గంభీర్ 54 బంతుల్లో 72 చేయగా ఆ మ్యాచ్లో 1 బాల్ కి 0 పరుగులు అని తెలిపాడు. దానితోపాటు గుర్తుంచుకోవాల్సింది మేము ప్రపంచకప్ గెలిచాము అని చెప్పాడు.

IHG't remember his age, how will he remember my ...


అలాగే గౌతం గంభీర్ అవును నాకు యాటిట్యూడ్ ఉంది కానీ ఎవరి పట్ల అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర, మోసగాళ్ల దగ్గర, అలాగే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారి దగ్గర అంటూ ఆఫ్రిది ని ట్యాగ్ చేస్తూ గౌతం గంభీర్ విరుచుకుపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: