టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్, కెప్టెన్‌గానే అందరికీ తెలుసు. అయితే.. ధోనీ చక్కగా మీడియం పేస్ బౌలింగ్ చేయడం ఎప్పుడైనా ఎవరైనా చూశారా..? అలాంటింది కేవలం బౌలింగ్ చేయడమే కాదు.. 2011 సంవత్సరంలో అప్పటి ఇంగ్లాండ్ అగ్రశ్రేణి బ్యాట్స్‌ మెన్ కెవిన్ పీటర్సన్ వికెట్ కూడా ధోనీ తీసాడు. కాకపోతే.. ఆఖరి క్షణంలో అతను DRS ని కోరడం.. మళ్లీ అంపైర్ తన ఔట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటూ నాట్ అవుట్ గా ప్రకటించడం జరిగింది. కాకపోతే..., ఇప్పటికీ ధోనీ ఫస్ట్ వికెట్ గురించి కెవిన్ పీటర్సన్ అప్పుడప్పుడు చర్చిస్తూ ఉంటాడు.

అయితే తాజాగా కెవిన్ పీటర్సన్ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్ ద్వారా మాట్లాడుతుండగా.. MS ధోని గొప్పతనం గురించి ఒక అభిమాని అడిగాడు. ‘‘ధోనీపై అందరూ పెంచుకున్న అంచనాలకి విరుద్ధంగా మాట్లాడటం చాలా కష్టం. అతను వ్యక్తిగతంగా జీవిస్తున్న తీరు, క్రికెట్‌ లో అతను సాధించిన విజయాలకి ఆ మాత్రం అంచనాలు ఉండటం సహజం’’ అని తెలివిగా కెవిన్ పీటర్సన్  పేరుకొన్నాడు. ఇక ఆ తర్వాత ధోనీ ఫస్ట్ వికెట్ మీరే కదా..? అని ఒకరు ప్రశ్నించగా.. ‘‘ నిజానికి చాలా మంది ఇలానే అడుగుతుంటారు. అవును నిజమే.. ధోనీ ఫస్ట్ వికెట్ నేనే. కాకపోతే.. DRS కోరిన తర్వాత అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దాన్ని మర్చిపోయారా..?’’ అని పీటర్సన్ ఎదురు ప్రశ్న ప్రశ్నించాడు.

 


2011 సంవత్సరంలో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యా‌చ్‌ లో ధోనీ తన బౌలింగ్‌ లో కెవిన్ పీటర్సన్ ఆ సమయంలో వికెట్ కీపర్ రాహుల్ ద్రవిడ్‌ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ఆ ఔట్‌ పై సందేహం వ్యక్తం చేసిన కెవిన్ పీటర్సన్ DRS కోరగా అది రిప్లై‌లో బంతి బ్యాట్‌ కి తాకలేదని తెలిసింది. ఇక అంతే అంపైర్ బిల్లీ బౌడన్ తన ఔట్ నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకున్నాడు. 2014 సంవత్సరంలో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రుడు.. రిటైర్ సమయానికి జీరో వికెట్‌ తోనే టెస్టు కెరీర్‌ ని ముగించాడు ధోని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: