టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఢిల్లీలో ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే గా కొనసాగుతున్న గౌతం గంభీర్ ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ గా రోహిత్ శర్మని ఎంచుకున్నాడు. ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అని అతను అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఇప్పటికి 12 సీజన్లు జరిగిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ పన్నెండు సంవత్సరాల టోర్నీలలో ఎక్కువ సార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. 

 

 

అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ కూడా తన వంతుగా మూడుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్ టోర్నీ అందించాడు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా ఐపీఎల్ రెండు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ నిషేధించడం సంగతి తెలిసిందే. అయితే ఆడిన ప్రతి సీజన్లోనూ చెన్నై ప్లేయర్ చేయడం ఆలోచించదగ్గ విషయం. వాస్తవానికి ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ ఎవరు అనే అంశంపై మాట్లాడుతున్న అంచనా ప్రకారం రోహిత్ శర్మ అద్భుత కెప్టెన్ అని ఇప్పటికే నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడని అది అతనికున్న కెప్టెన్ సామర్థ్యం అని తెలిపాడు.

 


చివరికి ఐపీఎల్ కెరియర్ ని రోహిత్ శర్మ అత్యధిక టైటిల్స్ ను గెలిచిన కెప్టెన్ గా ముగిస్తాడు అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా గౌతం గంభీర్ రోహిత్ శర్మని తన ఖాతాలో నాలుగు టైటిల్ ప్రస్తుతం ఉండగా మొత్తానికి మరో రెండు టైటిల్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పాడు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ కి వరుసగా 2013 , 2015 , 2017 , 2019 ఐపీఎల్ సీజన్లో టైటిల్ గెలిచింది. అలాగే గౌతం గంభీర్ కూడా కోల్ కతా  నైట్ రైడర్స్ టీంకు కెప్టెన్ గా ఉండే సమయంలో రెండు సార్లు ఆ జట్టుకు ఐపీఎల్ టోర్నీ అందించగలిగారు. అయితే 2020 ఐపీఎల్ సీజన్ మాత్రం మార్చి 29న ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో అది రద్దు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: