టీమిండియా మాజీ ఆల్ రౌండర్, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ప్లేయర్, వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఈపాటికి ఇట్టే అర్థం అవుతుంది అతను ఎవరో కాదు యువరాజ్ సింగ్. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్లేయరలందరూ వారి ఇంటికే పరిమితం అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే క్రికెటర్లు కొంతమంది ఆన్లైన్ లోకి వచ్చి కొన్ని సరదా సంఘటనలు చేస్తున్నారు.

 


ఇప్పుడు ఈ కోవకే యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చారు. వీరి సంభాషణ ఆసక్తికరంగా సాగుతున్న నేపథ్యంలో మహమ్మద్ కైఫ్ యువరాజ్ సింగ్ నీ తదుపరి భవిష్యత్ ప్రణాళికల భాగంగా నువ్వు కామెంటేటర్ గా మారే అవకాశాలు ఉన్నాయా అని మహమ్మద్ కైఫ్ ప్రశ్నించాడు. దీనితో యువరాజ్ సింగ్ కామెంట్రీ బాక్స్ లో కొందరి వాదన భరించలేని విధంగా ఉన్నాయి కనుక వారితో కలిసి కూర్చుని ఎక్కువసేపు కామెంట్లు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఈ కామెంట్ ఐసీసీ ఈవెంట్స్ లో చెప్పాలని ఉంది అని యువరాజ్ సింగ్ తనలోని విషయాన్ని తెలిపాడు. మామూలుగా  మైదానంలో ఉండే ఆటగాళ్ల ఒత్తిడి అది వారికే తెలుస్తుంది. అయితే వాళ్ల తప్పిదాలు తెలుసుకునే విధంగా చేయడం వారి బాధ్యత అని యువరాజ్ సింగ్ తెలిపాడు.

 


ఇక 2007 సంవత్సరంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న యువరాజ్ సింగ్ అలాగే 2011 సంవత్సరంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ టీమ్ ఇండియా గెలచడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది సీరీస్ పొందాడు. అయితే ఆ తర్వాత యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడడంతో అతనికి టీమిండియాలో స్థానం కోల్పోవడం జరిగింది. తర్వాత తిరిగి పురాగమనం చేసిన కూడా సపోర్టు లభించకపోవడంతో క్రికెట్ నుంచి తాను తప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: