ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ మ్యాచ్ రద్దు అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా వరల్డ్ కప్ పై సందేహాలు ఏర్పడుతున్నాయి. ఆ తరుణంలోనే ఆస్ట్రేలియా వేదికగా జరగవలసిన టి - 20 వరల్డ్ కప్ భారత్లో అనుమతి ఇస్తే బాగుంటుంది అని ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. కరోనా  వైరస్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ విధానాన్ని సెప్టెంబర్ 30 పర్యాటక వీసాల పై విధించడం జరిగింది. ఈ నిర్ణయంతో అక్కడ టి20 వరల్డ్ కప్ నిర్వహించడం పై సందేహాలు ఏర్పడుతున్నాయి. టోర్నీని వాయిదా వేయడం లేదా రద్దు చేయాలని ఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 


2021లో టి20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు.. భారతదేశానికి ఆతిధ్యం ఇస్తే.. ప్రస్తుతం భారత్ - ఆస్ట్రేలియా ఒక ఒప్పందానికి వచ్చి హక్కులను మార్చుకుంటే చాలా బాగుంటుంది అని సూచించాడు. ఒకవేళ ఆతిధ్యం ఇస్తే కనుక ఈ సంవత్సరం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మ్యాచ్ వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా టి20 వరల్డ్ కప్ క్రికెట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది అని తెలియజేశారు. ఇక వరల్డ్ కప్ కంటే ముందుగానే ఐపీఎల్ నిర్వహించాలి అనే ఆలోచనలో బిసిసిఐ ఉందని సమాచారం. 

 


ప్రస్తుతం భారత్ లో మార్చి నెల నుంచి ఇలాగే కొనసాగుతుండగా మే 3 ముగింపు పడనున్నది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ పై ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తుందని అర్థమవుతుంది. అంతేకాకుండా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తే...తర్వాత కూడా భారత్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తే ఆటగాళ్ల ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటుందని భావిస్తోంది. అంతేకాకుండా భారత్ క్రికెటర్లకు కూడా ఐపిఎల్ రూపంలో చాలావరకు ప్రాక్టీసు చేసినట్లు ఉంటుంది అని సునీల్ గవాస్కర్ తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: