కరోనా దెబ్బకు ప్రపంచంలోని అన్ని క్రీడా రంగం సంబంధిచి అన్ని కార్యక్రమాలు రద్దు అయ్యాయి. ఇక లాక్ డౌన్ లో ప్రేక్షకులను ఎదోకరకంగా వినోద పరచాలని క్రికెటర్లు, సినిమా వాళ్ళు నానా హాయిరాన పడిపోతున్నారు. ఎవరికీ వారు సోషల్ మీడియాలో కనిపిస్తూ తమకు సంబంధించిన విషయాలను వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇదే కోవలోకి తాజాగా టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, మరో బెంగాల్ వెటరన్ ఆటగాడు మనోజ్ తివారీ తో సోషల్ మీడియాలో కొద్ది సేపు సరదాగా మాట్లాడారు. అయితే షమీ తన కెరీర్ మొదట్లో అతనికి సహాయం అందించిన ఇద్దరి ఫాస్ట్ బౌలర్ల పేర్లను కూడా తెలిపాడు.

 


IPL ఫ్రాంచైజ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ ( KKR) లో ఆడుతున్న సమయంలో, అతను మొదట తన సీనియారిటీతో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ ‌తో మాట్లాడటంలో ఇబ్బందులు పడ్డానని చెప్పాడు. ఆ తర్వాత అతనే తనకు స్వయంగా సహాయం చేసాడని చెప్పుకొచ్చాడు. “నేను KKR కు ఆడుతున్నప్పుడు, క్రికెట్ సంబంధించిన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశానని చెప్పాడు. అయితే వసీం అక్రమ్ ‌ను అప్పటి వరకు కేవలం టీవీలో మాత్రమే చూసానని తెలిపాడు షమీ.

 

 

అయితే KKR తో ఆడిన తర్వాత నేర్చుకునే అవకాశం వచ్చిందని షమీ చెప్పాడు. అయితే తాను మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్న సమయంలో వసీం తన వద్దకు వచ్చి తానే స్వయంగా మాట్లాడటం, బౌలింగ్ గురించి మెళుకువలు చెప్పడం మొదలు పెట్టాడని తెలిపాడు. నిజానికి తనను అక్రమ్ బాగా చదివేశాడు అని చెప్పడం నిజంగా గమనార్హం. ఆటకు సంబంధించి ఏమి కావాలన్నా సిగ్గు పడకుండా తనని వచ్చి అడగాలని అక్రమ్ చెప్పినట్టు గుర్తు పెట్టుకొని చెప్పాడు షమీ.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: