భారత క్రికెట్ ‌లో క్రికెట్ గాడ్, ఎవరెస్ట్ అంతటి దిగ్గజంలా క్రికెట్ అభిమానులు పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు 47 వ జన్మదినం జరుపుకుంటున్నాడు. తను క్రికెట్ ‌కు గుడ్ బై చెప్పి ఆరు సంవత్సరాలు గడిచినా.. సచిన్ ‌కు మాత్రమే సాధ్యమైన క్లాస్ బ్యాటింగ్, అప్పర్ కట్ ఇంకా అభిమానుల కళ్ల ముందు అలా కదలాడుతూనే ఉంది. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సచిన్ రికార్డుల గురించి అభిమానులు ఇంకోసారి గుర్తు చేసుకుంటున్నారు.

 

IHG

 

ఇక మన క్రికెట్ దేవుడు సచిన్ గురుంచి మరోసారి పూర్తి వివరాలు చూద్దామా...! మన లిటిల్ మాస్టర్ గా పిలుచుకునే సచిన్ పూర్తి పేరు సచిన్ రమేశ్ టెండూల్కర్. ఇక ఈయన మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఉన్న దాదర్ ప్రాంతంలో 1973 సంవత్సరంలో పుట్టారు. ఆయన తండ్రి రమేశ్ టెండూల్కర్ ప్రముఖ మరాఠీ నవలాకారుడు, సంగీత విద్వాంసుడు కూడా. సచిన్ తండ్రి సంగీత విద్వాంసుడు సచిన్ దేవ్ బర్మన్ ‌పై ఉన్న అభిమానంతో తన కొడుకుకి సచిన్ అని నామధేయం చేసాడు. 

 

IHG

ఇక కేవలం 16 సంవత్సరాల వయసులో పాకిస్తాన్ జట్టు‌పై మ్యాచ్‌ తో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. చాలా కొద్ది కాలంలోనే క్రికెట్ దిగ్గజాల సరసన సచిన్ చోటు సంపాదించాడు. సచిన్ తన రెండు దశాబ్దాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ‌లో మొత్తం 200 టెస్టులు, 463 వన్డేలు, ఒక టీ - 20 ఆడిన సచిన్, అన్ని ఫార్మెట్స్ లో కలిపి మొత్తం 34, 357 పరగులు సాధించాడు. ఇక వన్డేల్లో మొట్ట మొదటిసారిగా 200 పరుగులు కొట్టిన క్రికెటర్ గా సచిన్ రికార్డు సాధించాడు. అయితే సచిన్ తన కెరీర్ లో అత్యధికంగా 6 సార్లు ప్రపంచ కప్ టోర్నీల్లో ఆడగా, అతని కల చివరి వరల్డ్ కప్ టోర్నీలో నెరవేరింది.

IHG

 

ఇక తను నవంబర్ 2013 సంవత్సరంలో సచిన్ తన చివరి మ్యాచ్ ‌ను వెస్టిండీస్ ‌పై ఆడాడు. ముంబై నగరంలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ సచిన్‌ కెరీర్ ‌లో 200వ టెస్ట్. ఆ తర్వాత ముంబై తరుపున ఐపీఎల్ ‌లోనూ ఆడిన సచిన్ టెండూల్కర్ మొత్తంగా 78 మ్యాచ్‌ ల్లో 2334 పరుగులు చేయగా, అందులో 13 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ చేసాడు. నిజానికి ఇప్పటికి ఏదైనా ఛానల్ లో సచిన్ బ్యాటింగ్ వస్తుంది అంటే చాలా మంది అలా చూస్తూ ఉంది పోతారంటే నమ్మండి. ఇక చివరగా సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: