ప్రపంచంలోని ఏ  జట్టుతో మ్యాచ్ ఆడిన ఉందని  భావోద్వేగం కేవలం భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో ఆడినప్పుడు మాత్రం ఎక్కువగా ఉంటుంది. మిగతా జట్ల విషయంలో ఓడిన స్పోర్టివ్ గా  తీసుకోగలుగుతారేమో కానీ చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్ తో  ఓడితే మాత్రం అది ఎంతో బాధను కలిగిస్తూ ఉంటుంది. కేవలం క్రికెట్ ఆడుతున్న 11 మంది ఆటగాళ్లకు మాత్రమే కాదు 130 కోట్ల జనాభాకు అదే భావోద్వేగం ఉంటుంది. అలా ఉంటుంది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్. ఇలాంటి మ్యాచ్లో అలుపెరుగని పోరాటం చేసి అడుగు దూరంలో వెనుదిరిగితే  ఆ తర్వాత జట్టు ఓటమి పాలైతే ఆ బాధ మరింత ఎక్కువగా  ఉంటుంది. 1999లో చెన్నైలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన టెస్టులో మాస్టర్ అనుభవించిన వేదన ఇలాంటిదే అని చెప్పొచ్చు. 1999లో పాకిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 271 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగినది  భారత జట్టు. అప్పటికే భారత జట్టులో కీలక ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. 

 

 

 అయినప్పటికీ చెలరేగి ఆడి ఏకంగా అజేయంగా 136 పరుగులు చేశాడు. అయితే నయన్ మోంగియా  మినహా మిగతా వారంతా విఫలం కావడంతో... వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతున్న లిటిల్ మాస్టర్ మాత్రం జట్టు విజయం కోసం చివరి వరకు చెమటోడ్చి పోరాడాల్సి వచ్చింది. ఈ పోరాటంలో 254 పరుగుల వద్ద సచిన్ ఏడో వికెట్ గా మైదానం నుంచి వెనుదిరిగాడు. ఆ తర్వాత కేవలం నాలుగు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది భారత్. ఇంతలోనే భారత్కు ఓటమి దరి చేరింది. 12 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో అటు ఆటగాళ్లతో పాటు భారత క్రికెట్ ప్రేక్షకులందరూ నిరాశలో మునిగిపోయారు. అయితే జట్టు ఓడినప్పటికీ సచిన్ టెండూల్కర్ మాత్రం తన పోరాటంతో ప్రేక్షకుల మనసులను గెలిచాడు. సచిన్ పోరాటానికి ఏకంగా ప్రేక్షకులందరూ స్టాండింగ్ ఓవియేషన్  ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు. 

 

 

 అయితే భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో ఓటమిని సచిన్ టెండూల్కర్ జీర్ణించుకోలేకపోయాడు. అయితే ఈ విషయాన్ని అప్పటి భారత కోచ్ అన్షుమన్ గైక్వాడ్  ఓ సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఆ మ్యాచ్ లో  ఓటమి తర్వాత జరిగిన పరిస్థితుల గురించి వెల్లడించారు. జట్టు గెలుపు కోసం ఎంతగానో పోరాటం చేసిన సచిన్ టెండూల్కర్ అవుట్ అయిన తర్వాత ఎంతో నిరాశ చెందాడు అని. ఇక భారత జట్టు ఓడిపోయినది  అని తెలిశాక అతను డ్రెస్సింగ్ రూమ్ విడిచి బయటికి రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరికీ కనిపించకుండా ఒక టవల్ ని అడ్డుపెట్టుకొని సచిన్ టెండూల్కర్ వెక్కి వెక్కి ఏడ్చాడు అంటూ గుర్తు చేశాడు. ఆ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్కు మాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినప్పటికీ అది తీసుకోవడానికి సచిన్ మాత్రం అంగీకరించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. చివరికి ఎంతో భావోద్వేగానికి గురైన సచిన్ను  తాను సముదాయించాల్సి  వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. నేటితో భారత క్రికెట్ దేవుడిగా క్రికెట్ ప్రేక్షకులు పిలుచుకునే సచిన్ టెండుల్కర్ 47వ వసంతంలోకి అడుగుపెడుతుండగా  సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: