ఇక ముందు రోజుల్లో భారత జట్టు ఆశాకిరణం శుభమన్ గిల్ అవుతాడు అని ప్రస్తుత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని తెలిపాడు. దేశవాళీ క్రికెట్ పోటీలలో తాను నిలకడగా రాణిస్తూ ఉన్నాడని దీనితో అతనికి గత ఏడాది నుంచి భారత్ జట్టులో సెలెక్టర్లు చోటు కల్పించడం జరిగిందని తెలిపాడు. అయితే చివరికి తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం లభించలేదు ఈ యువ బ్యాట్స్ మెన్ కి. అయితే ఈ కుర్రాడు నిలకడగా అడిగితే అతను ఒక గొప్ప క్రికెటర్ అవుతాడని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

 

IHG


తాజాగా హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చారు. వీరిద్దరి మాటల మధ్యలో  శుభమన్ గిల్ గురించి విషయం వచ్చింది. దీనితో రోహిత్ శర్మ మాట్లాడుతూ  శుభమన్ గిల్ కి మంచి బ్యాటింగ్ నైపుణ్యం ఉందని అతడు టీమిండియాకు కాబోయే ఆశాకిరణం అని తాను తెలిపాడు. అంతేకాకుండా  శుభమన్ గిల్ తన బ్యాటింగ్ లో నిలకడ కొనసాగిస్తే అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుందని దానితో అతడు మెరుగైన రికార్డ్స్ సాధించగలడు అని అతను తెలిపాడు. తన అంచనా ప్రకారం అతి త్వరలోనే అతడు మళ్ళీ భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉందని రోహిత్ శర్మ తెలిపాడు.

IHG


అయితే నిజానికి గత సంవత్సరం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ కి  శుభమన్ గిల్ కు ఓపెనర్ గా ఛాన్స్ దక్కుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా రోహిత్ శర్మ ఓపెన్ అవతారం ఎత్తడంతో అందులోనూ సెంచరీ కొట్టడంతో మళ్లీ  శుభమన్ గిల్ కు ఆడే అవకాశం లభించలేదు. అయితే ఈ యువ క్రికెటర్ మాత్రం తన దేశవాళీ క్రికెట్లో, భారత్-ఏ జట్టుతో కలిసి నిలకడగా ఆడుతున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: