నిజానికి టీమిండియా క్రికెటర్స్ అందరూ లాక్ డౌన్ కారణంతో ఎవరి ఇంటిలో వారు ఉంది పోయారు. అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులతో హాయిగా వారు కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంతంది వారి అభిమానులను అలరించడానికి అప్పుడప్పుడు ఆన్లైన్ లో ప్రత్యక్షమవుతున్నారు. దీనితో వారి అభిమానులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలను ఇస్తూ వారిని కుష్ చేస్తున్నారు. ఐతే ఇవన్నీ నాకు ఎం పట్టవు అన్నట్టు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. 

 

తాజాగా రాహుల్ ద్రావిడ్ ఇన్‌ స్టాగ్రామ్ లైవ్ వీడియో చాట్ సందర్భంగా తాను సోషల్ మీడియాలో ఎందుకు చురుకుగా లేనని తెలియచేస్తూ, అది నేను ఉపయోగించాల్సిన అవసరం తనకు లేదని అలాగే అతను టెక్నాలజీకి అలవాటుపడనందున దానికి దూరంగా ఉండటానికి నేను ఇష్టపడతానని తెలిపాడు. మాములుగా నేను సోషల్ మీడియాలో లేనందుకు ప్రత్యేకమైన కారణం అంటూ ఏమి లేదు, అందులో నేను చురుకుగా ఉండటానికి ఎటువంటి కారణం నాకు కనిపించడం లేదు" అంటూ ద్రవిడ్ తన ఇన్ ‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా చెప్పాడు. 

 


ఇక నేను నా ఫోన్ ‌లో నాకు అవసరమైన వ్యక్తులతో కమ్యూనికేట్ చేస్తుంటాను. కనుక ఆన్లైన్ లో చురుకుగా ఉండవలసిన అవసరం లేదని ఇటీవల నేను అనుకునాన్ని, కాకపోతే చాలా ఆసక్తికరమైన కథనాలు ఇంకా కోచింగ్, నిర్వహణ మరియు ఫిట్‌నెస్ నేను చేసే పనికి సంబంధించినవి అంటూ తెలిపాడు ద్రావిడ్. కనుక నేను ఆన్ ‌లైన్ ‌లో కొన్ని అంశాలను మాత్రం చదువుతున్నాను, కానీ నేను దానితో ముందుకు వెళ్లను' అని తెలిపాడు. ఇంకోవైపు కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా  ఆగిపోయిన క్రికెట్, క్రీడాకారులను వారి ఇళ్లకు, అలాగే ఇండోర్ శిక్షణకు పరిమితం చేసింది బోర్డు. ఇకపోతే క్రికెటర్లు ఆటకు దూరంగా ఉండటం కష్టమని, మ్యాచ్ లు తిరిగి ప్రారంభమైన తర్వాత వారు ఫామ్ లోకి రావడానికి కొద్ది మేర సమయం పడుతుందని ద్రవిడ్ ప్లేయర్స్ ను ఉద్దేశించి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: