భారత్ క్రికెట్ జట్టు తరఫున 24 ఏళ్లు ప్రాతినిధ్యం వహించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200 టెస్టు మ్యాచులు, 15921 పరుగులు సాధించాడు. ఇక 463 వన్డేలు లో 18426 అత్యధిక పరుగులు సాధించిన ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. 2013 నవంబర్ 16న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూనే దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్నాడు. దీనికి ముందే 1984లో అర్జున అవార్డు, 1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ కేల్ రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్ పురస్కారలను పొందారు. రికార్డుస్థాయిలో 6 ప్రపంచ కప్ పోటీలలో ఆడిన సచిన్ టెండూల్కర్ 2011 వ సంవత్సరంలో విశ్వ విజేత జట్టు గా నిలిచిన ఇండియా టీం జట్టు సభ్యుడిగా నిలిచి తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు.

 

రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన మాస్టర్ తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. తన రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా గాని ఇంకా సచిన్ పేరు మేధా రికార్డులు చాలా అలానే ఉండిపోయాయి. ప్రధానంగా వన్డే మ్యాచ్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు తో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు కూడా సచిన్ పేరు మీద ఇంకా అలానే ఉన్నాయి. తాజాగా ఈ రోజు 47 వసంతాలు పూర్తిచేసుకుని 48 వ సంవత్సరంలో అడుగు పెట్టడంతో తన పుట్టిన రోజు వేడుకలకు కరోనా వైరస్ కారణంగా దూరంగా ఉన్నాడు. ఈ సందర్భంగా దేశం కోసం ప్రజల కోసం పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఇదే నేను ఇచ్చే గౌరవం అని సోషల్ మీడియాలో తెలిపారు.

 

మైదానంలో ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టిన గాని తన బ్యాట్ తో సమాధానం చెప్పే సచిన్ తన వ్యక్తిత్వంలో కూడా ఎక్కడా కూడా రూమర్లు లేకుండా చాలా వరకు ఆదర్శంగా అందరికి నిలిచాడు. ఎన్నో రికార్డులు తన పేరిట ఉన్నాగాని ఎక్కడ కుంగిపోకుండా భారత జట్టు గెలవాలని, ఆ విషయంలో తన కృషి ఉండాలని, ఎప్పటికప్పుడు సచిన్ మైదానంలో ఆడేవాడు. చాలా వరకు ఎన్నో ఒత్తిడులు, ఒడిదుడుకులు వచ్చినా గానీ తట్టుకొని నిబద్ధత కలిగి విజయాలు భారత జట్టుకి తీసుకువచ్చి భారతీయ క్రికెట్ ప్రేమికులకు ‘క్రికెట్ దేవుడయ్యాడు’ అంతే కాకుండా భారత క్రికెట్ చరిత్రలో ఎక్కువగా తనకంటూ పేజీలు ఉండేలా చూసుకున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: